కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజల్, గ్యాస్, ధరలను  పెంచి నందుకు నిరసనగా సైకిల్ యాత్ర

0 15

నంద్యాల కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ జిల్లా  డిసిసి అధ్యక్షులు జె.లక్ష్మీ నరసింహ యాదవ్

నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల పట్టణంలో గురువారం నాడు
డీజల్, పెట్రోల్, గ్యాస్, మరియు నిత్యావసరాల ధరలను వెంటనే తగ్గించాలనే ప్రధాన డిమాండ్ తో ఏఐసీసీ మరియు పీసీసీ పిలుపు మేరకు జరుగుతున్న ప్రజాభిప్రాయ కార్యక్రమంలో భాగంగా నేడు గురువారం నంద్యాల లో స్థానిక గాంధీ చౌక్ నుండి శ్రీనివాస సెంటర్ వరకు సైకిల్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ జిల్లా డిసిసి అధ్యక్షులు జె.లక్ష్మీనరసింహ యదవ్ .  పాల్గొని ముందుగా   లక్ష్మీనరసింహం. నగర అధ్యక్షుడు దాసరి చింతలయ్య, సీనియర్ నాయకులు ఎస్,ఎం,డి ఫరూక్ , అధికార ప్రతినిధి వాసు, కలిసి  గాంధీ విగ్రహానికి పూల మాల వేసి అనంతరం సైకిల్ యాత్ర ను గాంధీ చౌక్ నుండి శ్రీనివాస్ సెంటర్ వరకు కొనసాగించారు ఈ సందర్బంగా లక్ష్మీ నరసింహ యాదవ్ గారు మాట్లాడుతూ ప్రధాని మోడీ విధానాలతో దేశం ప్రమాదం లో పడిందని, కేంద్రo లో మోడీ విధానాలకు రాష్ట్రం లో సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడి  వత్తాసు పలుకుతూ రాష్ట్ర ప్రజలను మరింత పన్నుల ఊబి లోకి తోసేసారని ఆవేదన వ్యక్తం చేశారు, గత కాంగ్రెస్ ప్రభుత్వం లో కేంద్ర ఎక్సైజ్ సుంకం పెట్రోల్ పై లీటర్ కు 9.48, డీజల్ పై లీటర్ కు 3.56 పైసలు మాత్రమే వసూలు చేసేదని, అయితే ప్రస్తుత బిజెపి ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పై 33, లీటర్ డీజల్ పై 31.80 పైసలు కేంద్ర ఎక్సైజ్ సుంకం వసూలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు, ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు పెంచి పెట్రోల్ డీజల్ ధరలను సెంచరీ దాటించారని ఎద్దేవా చేశారు, సబకా వికాస్ అంటే దేశం ఏడూ నెలల్లో ఏడూ సార్లు  వంట గ్యాస్ ధరలు పెంచి మహిళల కంట కన్నీళ్లు తెప్పించటమే అని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు నుండి కోవిడ్ 19 వరకు ప్రతీది మోడీ విఫలం అయ్యారని విమర్శించారు. అచ్చెదిన్ అని మంచిరోజులు వస్తాయని మతం పేరుతోనే బిజెపి రాజకీయాలు చేస్తుందని ఆవేదనవ్యక్తం చేశారు. వంట నూనె ధరలను ఏకంగా డబుల్ సెంచరీ దాటించారని ఆవేదన వ్యక్తం చేశారు, దేశం లో మొదటి సరిగా చెత్తపన్ను వాసూలు చేస్తున్న చెత్త ప్రభుత్వం జగన్ ప్రభుత్వమే అని తెలిపారు, ఈ కరోన కష్ట కాలం లో ఈ పన్నుల భారం ఏంటని ప్రశ్నించారు, జగన్ విడుదల చేసిన జాబ్ లెస్ క్యాలెండర్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు . త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇంటింటి కార్యక్రమం తీసుకుంటుందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో డిసిసి జిల్లా నిర్వహణ కార్యదర్శి భరత్ కుమార్, ఉపాధ్యక్షులు గంధం మల్లేశ్వరెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు పఠాన్ హాబీబ్ ఖాన్, జిల్లా కార్యదర్శలు ఇస్మాయిల్,  షేక్ అబ్దుల్ రహమాన్, జిల్లా నాయకులు బిసి సెల్ రాష్ట్ర నాయకులు బోయ నాగరాజు ,  సుబ్బయ్య, శేషయ్య, ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు రియాజ్ ,  కాంగ్రేస్ పార్టీ అనుబంధ వికలాంగుల సంఘము ఆళ్లగడ్డ నియోజకవర్గ అధ్యక్షులు సంజీవ్ కుమార్, తేజ , లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

 

Tags:Cycle trip to protest against central government hike in petrol, diesel, gas and prices

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page