జిల్లాలో ఇసుక కొరత రానివద్దు

0 19

ఖమ్మం ముచ్చట్లు:

 

జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి పనుల నిర్మాణాలు, స్థానిక అవసరాలకు ఎక్కడా ఇసుక కొరత ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కర్ణన్‌ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్లో  నిర్వహించిన జిల్లా స్థాయి శాండ్‌ (ఇసుక) కమిటీ సమావేశంలో జిల్లాలో ఇసుక లభ్యత, ప్రభుత్వ అభివృద్ధి పనులు, స్థానిక అవసరాలకు సరఫరా తదితర అంశాలపై సమీక్షించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముదిగొండ మండలం గంగాపురం గ్రామంలో 24,181.5 క్యూబిక్‌ మీటర్ల ఇసుక తెలంగాణ రాష్ట్ర మైనింగ్‌ అభివృద్ధి సంస్థ ద్వారా, బోనకల్లు మండలం రాపల్లెలో 1275 క్యూబిక్‌ మీటర్ల ఇసుక సంబంధిత తహసీల్దార్‌ ద్వారా సరఫరాకు అనుమతించినట్లు తెలిపారు. ఆయా ఇసుక రీచ్‌ల నుంచి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి, ఇతర ప్రభుత్వ అభివృద్ధి పనులు, స్థానిక అవసరాలకు నిర్దేశించిన రుసుం ప్రకారం సరఫరా చేయాలన్నారు.
జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై గట్టి నిఘా ఉంచాలని, పోలీస్‌, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో గనుల శాఖ ఏడీ సంజయ్‌కుమార్‌, డీపీవో ప్రభాకర్‌రావు, భూగర్భ జల శాఖ డీడీ శ్యాంప్రసాద్‌, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శంకర్‌బాబు, రాష్ట్ర మైనింగ్‌ అభివృద్ధి సంస్థ పీడీ యల్లయ్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags: Let there be no shortage of sand in the district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page