నర్సుల అందోళన

0 9

హైదరాబాద్  ముచ్చట్లు:

తొలగించిన 1640 మంది అవుట్సోర్సింగ్ నర్సింగ్ సిబ్బంది ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు ధర్నా చౌక్ లో అవు ట్ సోర్సింగ్ నర్సులు ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్  కష్టకాలంలో విధులు నిర్వహిస్తే తమను ఉద్యోగుల నుంచి తొలగించడం అన్యాయమన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పోస్టులు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తున్నారని ఈ ప్రకటనకు ఎవరు మోసపోవద్దని మాలాగా ఎవరు కష్ట పడకూడదని సూచించారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో కాకుండా పర్మినెంట్ గా ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తొలగించిన 1640 మంది నర్సులు ఆందోళన చేపడుతున్న పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రెండురోజుల క్యాబినెట్ సమావేశంలో మంత్రులు సీఎం కేసీఆర్ మా అంశం పట్ల చర్చించి న్యాయం చేస్తారని ఆశించాము అని అన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు, తొలగించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

 

Tags:Nurses’ concern

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page