నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు 5వ  షెడ్యూల్ లో చేర్చడానికి ప్రణాళిక

0 7

దశాబ్దాలకాల ఎదురు చూపులకు పరిష్కారమార్గం
అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ
విశాఖపట్నం ముచ్చట్లు:

 

 

గిరిజన ప్రాంతాల్లో50% కంటే ఎక్కువ గిరిజన జనాభా కలిగి నాన్-షెడ్యూల్ ప్రాంతాల్లో గల గ్రామాలకు 5వ  షెడ్యూల్ లో కల్పడానికి సంబంధించిన సమావేశం  పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో  ప్రాజెక్టు అధికారి రొణంకి గోపాలకృష్ణ  ఆధ్వర్యంలో జరిగింది.  సమావేశంలో పాల్గోన్న అరకు నియోజకవర్గ శాసనసభ్యుడు చెట్టి పాల్గుణ మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా నాన్-షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు తమకు 5వ  షెడ్యూల్ లో కలిపి, అక్కడున్న గిరిజనులకు ప్రభుత్వాలు కల్పిస్తున్న పథకాలను తమకు కూడా వర్తించేలా చేయాలని పలుమార్లు వేడుకోవడం జరిగిందని, వారి కల త్వరలోనే నెరవేరబోతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా నాన్-షెడ్యూల్ ప్రాంతాల్లో ఉంటున్న ఎన్నో గిరిజన కుటుంబాలు, అభివృద్ధి లో ఎంతో వెనుకబడి ఉన్నారని, ఈ విషయాన్ని వైసీపీ ప్రభుత్వంలో తీరుతుండటం ఎంతో ఆనందింప దగ్గ విషయమని ఆయన అన్నారు.
ఐటీడీఏ పీఓ రోణంకి గోపాల కృష్ణ మాట్లాడుతూ గిరిజనుల కొరకు భారత రాజ్యాంగం లో 5వ, షెడ్యూలు ఏర్పాటు చేసి,వారికి ప్రత్యేక హక్కులు కల్పించడం జరిగిందని ఆయన అన్నారు. నాన్ షెడ్యూల్ లో ఉన్న గిరిజన గ్రామాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం ఆ గ్రామాల్లో ఉన్న  జనాభా మొత్తంలో 50% పైబడి గిరిజన జనాభా కలిగిన గ్రామాలకు 5వ, షెడ్యూలులో చేర్చడానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి త్వరలోనే సమర్పిస్తామని అన్నారు. పైన తెలుపబడిన విధముగా అర్హత కలిగిన గ్రామాలను గుర్తించి, ఆ గ్రామాల పరిధిలో, గ్రామసభలను నిర్వహించి, గ్రామసభ తీర్మాణమును తక్షణమే తమ కార్యాలయము నకు సమర్పించాలని, నాన్-షెడ్యూల్ మండల అభివృద్ధి అధికారులకు, తహసీల్దార్ లకు ఆయన ఆదేశించారు. ఈ ప్రతిపాదనలు జూలై 23న జరుగనున్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహామండలి సమావేశంలో ప్రవేశ పెట్టి, తుది నిర్ణయం  తీసుకుంటారని అన్నారు. ఈ సమావేశంలో పాడేరు ఎమ్మెల్యే: కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, సబ్ కలెక్టర్: బి.అభిషేక్, నర్షీపట్నం ఆర్.డి. ఓ: అనిత, అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి: వి.ఎస్ ప్రభాకర్, మరియు నాన్-షెడ్యూల్ మండలాల తహశీల్దార్లు తదితరులు పాల్గోన్నారు.

 

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags:Plan to include in the 5th schedule for tribals living in non-scheduled areas

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page