నా పరిస్థితి బాగానే వుంది,నటుడు నారాయణ మూర్తి

0 15

హైదరాబాద్  ముచ్చట్లు:

సోషల్ మీడియాలో తనపై వస్తున్న కథనాలను నటుడు నారాయణమూర్తి ఖంఢించారు. ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నాడంటూ గద్దర్ చెప్పిన మాటలను వక్రీకరించారని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేసారు. పల్లెటూరి వాతావరణంలో గడపడం ఇష్టం కాబట్టే సిటికి దూరంగా ఉంటున్నా. ఆటోలో రాకపోకలకే నెలకు రూ.30 వేలు ఖర్చవుతాయి, ఇంటి అద్దె కట్టుకోలేనా నని అయన అన్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు రాయడం వల్ల నా మనసుకు బాధ కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆర్థిక సహాయం చేస్తామంటే కన్నీళ్లు వస్తున్నాయి. కోట్లు సంపాదించా, నా వరకు సరిపడ దాచుకున్నా, మిగతాది సేవా కార్యక్రమాలకు ఇచ్చానని అయన అన్నారు.

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

 

Tags:My condition is fine, actor Narayana Murthy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page