నిండుతున్న తాలిపేరు

0 14

భద్రాద్రి కొత్తగూడెం  ముచ్చట్లు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం  తాలిపేరుకు వరద పోటు  పెరుగుతోంది. తాలిపేకె  ప్రాజెక్ట్ 16 గేట్లు ఎత్తి 11,248 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేసారు. లోతట్టున ఉన్న ప్రజలు పొంగి పొర్లు తున్న వాగులు దాటకుండా వాగుల వద్ద పటిష్ఠ నియంత్రణ చర్యలు చేపట్టాలని రెవిన్యూ, పోలీస్, పంచా యతి రాజ్ అధికారులను జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. ప్రాజెక్ట్ నీళ్లు, వర్షాల వల్ల జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న అంశంపై కలెక్టర్ ఆర్డివో, డిఆర్వో లతో సమా వేశం నిర్వహించారు. తాహాశీల్ధార్, పంచాయతీ రాజ్, పోలీస్ అధికారులు పొంగి పొర్లుతున్న వాగుల వద్ద 24 గంటలు పటిష్ఠ పహారా కాయాలని, ఎట్టి పరిస్థితిల్లో ప్రజలు వాగులు దాటకుండా నిలువరించాలని చెప్పా రు. ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లో తట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

- Advertisement -

Tags:The nickname of the filling

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page