నిత్యావసర ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ నిరసన – భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు

0 2

పాయకరావుపేట  ముచ్చట్లు:
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నాయకులు కదం తొక్కారు. ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగతా శ్రీనివాస్ నేతృత్వంలో గురువారం పాయకరావు పేట నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మంగవరం రోడ్డులోగల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం  నుంచి ప్రారంభమైన ర్యాలీ గౌతమ్ థియేటర్ సెంటర్ వరకు సాగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు  మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరల పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్న మైందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తుందని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి జగతా శ్రీనివాస్ మాట్లాడుతూ  పెట్రోలు, డీజిల్ , వంటగ్యాస్ ధరలు పెరగడం వల్ల సామాన్యులపై మోయలేని భారం పడుతుందన్నారు.నిత్యావసర వస్తువుల ధరలను అదుపుచేయటంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యా యన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలనలో రాష్ట్రం షన్ని రంగాల్లో అధోగతిపాలయ్యిందన్నారు. ఆర్థికంగా బాగున్న వర్గాలకు అవసరం లేకపోయినా వారి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్న సిఎం జగన్ కు రిక్షా కార్మికులు వెతలు కనిపించకపోవటం శోచనీయమన్నారు. కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన రిక్షా కార్మికులకు తక్షణమే ఒక్కొక్కరికీ పదివేల రూపాయలు ఆర్ధిక సాయమందించా లని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.  ఈ కార్యక్రమంలో ఎపీ తెలంగాణ ఐఎన్ టియుసీ ఉపాధ్యక్షులు జెర్రి పోతుల ముత్యాలు ,కాంగ్రెస్ పార్టీ  నాయకులు గుత్తుల శ్రీనివాసరావు,  అంగా వర్మ , మీసాల సుబ్బన్న ,  భాను, ఏసుతోపాటు  పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు , తరలి రాగా పలువురు రిక్షా కార్మికులు తమ రిక్షాలతో ర్యాలీలో పాల్గొన్నారు.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

- Advertisement -

Tags:Congress party protests over price hike
– Leaders and activists who came in large numbers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page