నీట మునిగిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లు

0 15

యాదాద్రి ముచ్చట్లు:

యాదాద్రి- భువనగిరి జిల్లాలో బుధవారం అర్ధరాత్రి వర్ష బీభత్సం సృష్టించింది. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం సహా పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం తో భారీ వరద కొండ మీద నుంచి దిగువకు మారింది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో వర్షం కారణంగా.. ప్రధాన రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొండపైకి భక్తులు వచ్చే రహదారిపై తొలగిపోవడంతో.. ఇబ్బందులు తలెత్తినట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా రహదారి వెంట ఉన్న రోడ్ల మరమ్మతులు చేపడుతున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు.  మరోవైపు,  యాదగిరిగుట్ట (మం), వంగపల్లిలో వరదల ప్రభావంతో.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబల్ బెడ్ రూమ్ నీటమునిగిన పోయింది. వరదనీటితో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రాంగణం చెరువును తలపించింది.

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

 

Tags:Submerged double bedroom house

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page