నీట మునిగిన హైజలాబాద్

0 67

హైదరాబాద్  ముచ్చట్లు:

హైదరాబాద్‌ నగరం మరోసారి నీట మునిగింది.. మూసీ ఉప్పొంగింది. హా నగరం నీట మునిగింది.. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. ఏ గల్లీ చూసినా చెరువులను తలపిస్తున్నాయి. చిన్న చినుకుకే వణికిపోయే హైదరాబాద్‌.. భారీ వర్షంతో అతలాకుతలమైంది. గత ఏడాది మిగిల్చిన చేతు జ్ఞాపకాలను మరోసారి కళ్ల ముందు నిలిపింది. బుధవారం సాయంత్రం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో నగరం నీట మునిగింది. కుండపోత వానలతో నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. కాలనీలు, ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. అటు వర్షపు నీరు రోడ్లపైకి రావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.చాలా చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గత ఏడాది భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో ఇప్పుడు కూడా వరద చేరింది. హయత్‌నగర్‌, నాగోల్‌, సరూర్‌నగర్‌లో కాలనీలు నీట మునిగాయి. ఉప్పల్‌లో అధిక వర్షాపాతం నమోదైంది.భారీ వర్షానికి నాగోల్‌, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో చాలా ఇళ్లలో వరద నీరు ముంచెత్తింది. కాలనీలు, రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో నాగోల్‌లోని అయ్యప్పకాలనీ నీట మునిగింది. వందలాది కుటుంబాలు ఇళ్లు వదిలి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.భారీ వర్షానికి హైదరాబాద్‌లోని మూసీ ఉప్పొంగింది.

 

- Advertisement -

మూసారాం బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించింది. దీంతో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు అధికారులు. మూసీ పరివాహన ప్రాంతాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నగరంలోని పటేల్‌నగర్‌, ప్రేమ్‌నగర్‌ కాలనీల్లో డ్రైనేజీలు ఉప్పొంగాయి. దీంతో వరద నీరు రోడ్ల మీదకు వచ్చి చేరింది.అటు లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. రామంతపూర్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వనస్థలిపురం చింతలకుంట జాతీయ రహదారిపై వర్షపునీరు నిలిచిపోయింది. అటు పాతబస్తీలో కూడా లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. అంబర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్లే దారిలోని మూసారాం బ్రిడ్జ్‌పై కి వరద నీరు వచ్చి చేరింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని లెనిన్‌ నగర్‌, ప్రశాంత్‌నగర్‌, మిథిలానగర్‌, బడంగ్‌పేట్‌ తో పాటు పలు కాలనీల్లోకి నీరు చేరింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో నాచారంలోని పలు కాలనీలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి.రెండు రోజులుగా ఏకధాటిగా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సరూర్‌నగర్‌, ఉప్పల్‌, హయత్‌నగర్‌, నాగోల్‌, ఓల్డ్‌సిటీ ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరడంతో జనం బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. బోడుప్పల్‌, పీర్జాదిగూడ ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, సామాగ్రి తడిసి ముద్దయ్యాయి. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వరదల్లో చిక్కుకున్నారు. హస్తినాపురం డివిజన్ సాగర్ ఎంక్లేవ్ లో పర్యటిస్తుండగా ఆయన కారు వరదల్లో చిక్కుకు పోయింది. ఎంత ప్రయత్నించినా కారు ముందుకు కదలలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది తో పాటు ఎమ్మెల్యే కూడా కారును తోశారు. చాలా సేపటి తర్వాత ఎలాగో వరద నుంచి బయట పడ్డారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.హైదరాబాద్‌లోని నాచారం, రాఘవేంద్రనగర్‌ కాలనీలను వరద నీరు ముంచెత్తింది. దీంతో కాలనీలు, ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ఇళ్ల నుంచి జనం బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. భారీ వర్షానికి హయత్‌నగర్‌లోని ఆర్టీసీ డిపో నీట మునిగింది. వాహనాలు బయటకి రాలేని పరిస్థితి ఏర్పడింది.  పీర్జాదీగూడలోని ప్రగతినగర్‌లో గత ఏడాది వరద నీరు ముంచెత్తింది. ఇప్పుడు కూడా మళ్లీ నీరు ముంచెత్తింది. దీంతో కాలనీని ఖాళీ చేస్తున్నారు స్థానికులు. మల్కాజ్‌గిరి, మౌలాలి ప్రాంతాలను కూడా వరద నీరు ముంచెత్తింది. దీంతో స్థానికులు వణికిపోతున్నారు.భారీ వర్షానికి నాగోల్‌, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరింది. కాలనీలు, రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో నాగోల్‌లోని అయ్యప్పకాలనీ నీట మునిగింది. వందలాది కుటుంబాలు ఇళ్లు వదిలి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. భారీ వర్షానికి హైదరాబాద్‌లోని మూసీ ఉప్పొంగింది. మూసారాం బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించింది. దీంతో కొన్ని గంటల పాటు రాకపోకలను అంతరాయం ఏర్పడింది. మూవీ పరివాహన ప్రాంతాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నగరంలోని పటేల్‌నగర్‌, ప్రేమ్‌నగర్‌ కాలనీల్లో డ్రైనేజీలు ఉప్పొంగాయి. దీంతో వరద నీరు రోడ్ల మీదకు వచ్చి చేరింది.వనస్థలిపురం చింతలకుంట జాతీయ రహదారిపై వర్షపునీరు నిలిచిపోయింది. అటు పాత బస్తీలో కూడా లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది.రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని లెనిన్‌ నగర్‌, ప్రశాంత్‌నగర్‌, మిథిలానగర్‌, బడంగ్‌పేట్‌ తో పాటు పలు కాలనీల్లోకి నీరు చేరింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో నాచారంలోని పలు కాలనీలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి.భారీ వర్షాలతో నాచారం, హబ్సీగూడ రహదారిలో భారీ వృక్షం నేలకూలింది. దీంతో రాకపోలకు అంతరాయం ఏర్పడింది. రామంతపూర్‌ లోని భవానీనగర్‌, శాంతినగర్‌, భరత్‌నగర్‌ కాలనీలను వర్షపు నీరు ముంచెత్తింది. దీంతో కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ఉప్పల్‌, అబ్దుల్లాపూర్‌పెట్‌లో అత్యధికంగా 20 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వనస్థలిపురం, హయత్‌నగర్‌లో 19, పెద్ద అంబర్‌పేటలో 18, సరూర్‌నగర్‌, రామంతపూర్‌లో 17 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. హబ్సీగూడలో 16, నాగోల్‌లో 15 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags:Submerged Hyderabad

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page