పచ్చదనం పెంపొందించాలి-జిల్లా కలెక్టర్ జి. రవి

0 6

జగిత్యాల  ముచ్చట్లు:

భావితరాలకు ప్రకృతి సంపదను, ఆహ్లాదకర వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసి జిల్లాను పచ్చదనం తో పెంపొందించేలా చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. గురువారం సారంగాపూర్ మండలం లోని రంగపేట,  నగునూరు మరియు రాయికల్ మండలం రాజా నగర్, ఆలూరు, అటవీ ప్రాంతాల్లో మరియు గ్రామాలలో 7వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ వారు చేపట్టిన మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. జిల్లాలో అటవిశాఖ ద్వారా రంగపేట మరియు అర్షికోట బ్లాక్, నగునూర్ బీట్ లో27 రకాలతో ప్రత్యేకంగా నాటిన 5555 మొక్కలను  పరిశీలించి మొక్కలు నాటారు. అంతరించిపోతున్న అడవులను సంరక్షించడంతో పాటు కొత్త మొక్కలను నాటి పూర్వ ఆటవి వైభవాన్ని  పెంపొందించాలని సూచించారు.  అటవి ప్రాతాలలో మొక్కలకు, జంతువులకు నీరు లభించేలా చర్యలను చేపట్టాలని సూచించారు. అనంతరం మొక్కలకు జంతువులకు నీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన  ఫామ్పౌండ్లను , నీటి గుంతలను పరిశీలించారు.  అటవీ ప్రాంతంలో అక్కడక్కడ గుంతలు తవ్వి మొక్కలు నాటక పోవడాన్ని గమనించి అందులో వెంటనే మొక్కలను నాటాలని, చనిపోయిన మొక్కలు స్థానంలో వేరెమొక్కలను నాటాలని అధికారులను ఆదేశించారు.  సారంగపూర్ మండలం రంగపేట వడ్డెర కాలనీలో 6వ విడత హరితహారం కార్యక్రమంలో బాగంగా గత సంవత్సరం నాటిన సుమారు 15000 మొక్కలను, వాటి పెరుగుదలను మరియు గత సంవత్సరంలో స్వయంగా నాటిన మొక్కను పరిశీలించారు.
సారంగాపూర్ మండలం నగునూరు, రాయికల్ మండలం రాజనగర్, ఆలూరు గ్రామాలలో వైకుంఠదామం చివరిదశ నిర్మాణ పనులు, పెండింగ్లో ఉన్న పనులు వారంరోజుల్లోగా పూర్తిచేయాలని ఆయా గ్రామాల సర్పంచులను ఆదేశించారు. వినియోగంలో ఉన్న డంపింగ్ యార్డ్, సెగిరికేషన్ షెడ్ వివరాలు అడిగి తెలుసుకొని, వాటి ద్వారా ఎరువులు తయారు చేసే విధానాన్నీ పరిశీలించారు.  రాజనగర్, ఆలూరు గ్రామంలలో గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు.  రాయికల్ మండలంలోని ఆర్సీ కోట రిజర్వ్ ఫారెస్ట్ నందు చేపడుతున్న మొక్కల పెంపకం పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఉపాధిహామీ కూలీల చేత అడవుల్లో వీలైనన్ని ఎక్కువ గుంతలు తొవ్వించి మొక్కలు నాటాలని సూచించారు. అడవుల్లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలు, ట్రెంచులు, ఫోమ్ పాండ్స్  వివరాలను అటవీ శాఖ అధికారులు నుండి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాయికల్ మండలంలోని చింతలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన  పల్లె ప్రకృతి వనం పరిశీంచి మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో జిల్లా అటవిశాఖ అధికారి వెంకటేశ్వరరావు, అడిషనల్ పిడి, మండల స్పెషల్ ఆఫీసర్ శివాజీ, ఎం.పి.డి.ఓలు, తసీల్దార్, ఎం.పి.ఓలు, పంచాయతీ కార్యదర్శిలు ఫారెస్ట్ విద్యార్థిని భార్గవి అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

 

Tags:Greenery should be enhanced-District Collector G. Ravi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page