పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం

0 9

సింగరేణి ఓపెన్ కాస్ట్ -5 ఏర్పాటుపై యాజమాన్యం ప్రత్యేక కార్యక్రమం
ప్రతిపక్ష పార్టీలు, ప్రభావిత గ్రామాల నుంచి నిరసనలు
పెద్దపల్లి   ముచ్చట్లు:
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు కానున్న ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు -5 విషయంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో పరిసర ప్రభావిత గ్రామాలతో పాటు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గోదావరిఖని పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ప్రజాభిప్రాయ సేకరణ ఆవరణలో ఆందోళనకు దిగారు. ఓసీపీ- 5 ఏర్పాటు వల్ల తమ ప్రాంతాలలో జల, వాయు, కాలుష్యం పెరిగి పోయి జీవనోపాధి కష్టమవుతుందని పేర్కొంటున్నారు. జనావాసాలకు సమీపంలో ఏర్పాటు చేయడం వల్ల పూర్తిస్థాయిలో జీవనోపాధి కోల్పోవాల్సి వస్తుందని పలు పార్టీల శ్రేణులు వ్యతిరేక భావాలను వ్యక్తం చేస్తున్నారు.  దీంతో వేదిక ఆవరణ  గందరగోళంగా మారింది. ఈ కార్యక్రమానికి  జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ, పర్యావరణ అధికారి రవిదాస్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, సింగరేణి జీఎం నారాయణ పలు రాజకీయ నాయకులు, సింగరేణి కార్మికులు హజరయ్యారు.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

- Advertisement -

Tags:Beginning of the environmental referendum

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page