పలు గ్రామాలకు రాకపోకలు బంద్

0 12

భువనగిరి ముచ్చట్లు:

 

మేఘం ఆగమాగం.. మన్నూ, మిన్నుకు ఏకధారగా కురిసిన ఎడతెరిపిలేని వర్షం.. ప్రజలను జడిపించింది. వాగులు, వంకలను ముంచెత్తింది. దీంతో పల్లెల మధ్య రాకపోకలు స్తంభించాయి. అల్పపీడనం అనల్ప ప్రభావం చూపింది. పనులు మీద బయట వెళ్లి ప్రజలను వాగులు దాటలేక నరకయాతన పడుతున్నారు.  రహదారులు కొట్టుకు పోయాయి..పంట పొలాలు జలమయమయ్యాయి.. భారీ వర్షానికి యాదాద్రి భువనగిరి జిల్లా జనజీవనం అతలాకుతలమైంది.నిన్న ఒక రోజే జిల్లాలో 1242.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో  బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది వలిగొండ మండలంలోని సంగెo గ్రామ శివారులో ఉన్న ధర్మారెడ్డి పల్లి కాల్వకు గండి పడి వరద నీళ్లు పంట వరి నారు మడ్లను ముంచింది. మూసి ఉదృతంగా  ప్రవహిస్తుండoతో బొల్లెపల్లి- సంగెo మధ్య బీమా లింగం కత్వా దగ్గర రోడ్డు మీద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

 

 

 

- Advertisement -

బీబీనగర్- భూదాన్ పోచంపల్లి మధ్య కూడా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  రుద్రవెళ్లి వద్ద రోడ్డు లెవ్ బ్రిడ్జి మీద మూసి ఉదృతంగా ప్రవహిస్తుండతో పోలీసులు ముళ్ల కంపను అడ్డపెట్టి ఎవరు అటుగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐదు ఏండ్ల క్రితం రుద్రవెళ్లి వద్ద మూసి వాగు పైన నిర్మిస్తున్న ప్లైఓవర్ పనులు పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వర్షాకాలం వచ్చిన ఇదే పరిస్థితి నెలకొంది వాపోతున్నారు రుద్రవెళ్లి గ్రామస్తులు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి వలిగొండ మండలంలోని  వెల్వర్తి-మల్లెపల్లి, వలిగొండ-సుంకిశాల, గోకారం-జాలుకాలువ, సంగెం-బొల్లేపల్లి, పులిగిల్ల-గోలిగూడెం, నాతళ్ళగూడెం-లింగరాజుపల్లి గ్రామ మధ్య రాకపోకలు అంతరాయం ఏర్పడింది.యాదాద్రి భువనగిరి జిల్లా  మూసి ఉదృతంగా ప్రవహిస్తోంది పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.జిల్లా కొన్ని చెరువులు అలుగు పోస్తున్నాయి.భువనగిరి మండలంలోని వడపర్తి కత్వా దగ్గర ఉదృతంగా ప్రవహిస్తోంది శమిర్ పెట్ వాగు.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: Traffic to many villages was closed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page