పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా  రాహుల్ దేవ్ శర్మ

0 4

ఏలూరు  ముచ్చట్లు:
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా  రాహుల్ దేవ్ శర్మ గురువారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అయనకు  పోలీసు అధికారులు, వేద పండితులు, వేద మంత్రాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తరువాత అయన మాట్లాడుతూ సాధారణ బదిలీలు భాగంగా పశ్చిమగోదావరి జిల్లా లో పని చేయడానికి అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, డిజిపి గౌతమ్ సావాంగ్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.   జిల్లాలోని శాంతి భద్రతల పరిరక్షణ కొరకు ప్రాధాన్యత క్రమంలో మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తామని అన్నారు.  జిల్లా లో పని చేస్తున్న అధికారుల సమన్వయంతో మహిళా చట్టాల అమలును పటిష్టంగా అమలచేస్తామని,  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ దర్యాప్తులలో పురోగతిని సాధిస్తామని అన్నారు. సిబ్బంది సంక్షేమం పట్ల అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటి కప్పుడు సిబ్బంది యొక్క అవసరాలను తీరుస్తామని అన్నారు.
నూతన ఎస్పీని జిల్లా అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ సి జయ రామరాజు,  ఏఆర్ అదనపు ఎస్పీ రామకృష్ణ, ఏలూరు డి ఎస్ పి డాక్టర్ దిలీప్ కిరణ్,  కొవ్వూరు డి ఎస్ పి బి. శ్రీనాథ్, నరసాపురం డిఎస్పి వీరాంజనేయ రెడ్డి, జంగారెడ్డిగూడెం డిఎస్పి డాక్టర్ రవికిరణ్, పోలవరం డిఎస్పి లత కుమారి, ఏఆర్ డీఎస్పీ కృష్ణంరాజు, ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పి సుబాకర్, శ్రీనివాస రావు, దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పి కె వి సత్యనారాయణ, సిసిఎస్ డిఎస్పి పైడేశ్వరరావు గారు ఎస్బి, సిఐ  సిహెచ్ కొండలరావు, ఏలూరు        వన్ టౌన్ సీఐ, వై.బి.రాజాజీ, ఏలూరు టూ టౌన్ సిఐ ఆది ప్రసాద్, త్రీటౌన్ సీఐ వరప్రసాద్,  బి సి ఆర్ బి సి ఎం ప్రసాద్, డి టి సి సి ఐ రామారావు,  ఏ.అర్ అర్. ఐ లు, కృష్ణంరాజు, మనోహర్, అంకమ్మరావు, పోలీస్ అధికారులు సంఘం అధ్యక్షుడు ఆర్ నాగేశ్వరరావు, బండారు నాని యు.ఎస్ అధికారుల సంఘం సభ్యులు ఎస్సైలు పోలీస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలను తెలియజేశారు.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

- Advertisement -

Tags:Rahul Dev Sharma as West Godavari District SP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page