పాలిచర్లపాడు, కురిచర్లపాడు ఆర్ బి కె లలో రైతు భరోసా చైతన్య యాత్రలు

0 8

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా  వెంకటాచలం మండల పరిధిలోని పాలిచర్ల పాడు, కురిచర్లపాడు ఆర్ బి కె లలో రైతు భరోసా చైతన్య యాత్రలు జరిగాయి.  ఈ కార్యక్రమంలో జె డి ఎ శివ నారాయణ, జిల్లా వనరుల కేంద్రం ఏ డి ఏ శ్రీనివాసులు, నెల్లూరు ఏ డి ఏ బాలాజీ నాయక్ , పశు వైద్య అధికారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలోని వ్యవసాయ రైతులకు ప్రభుత్వం వారు ఇచ్చే పచ్చిరొట్ట విత్తనాలు 50 శాతం సబ్సిడీ పొందే అవకాశం ఉందన్నారు. ఈ సబ్సిడీ  పొందాలంటే రైతులు ఎక్కువ సంఖ్యలో ఆయా ప్రాంతాల లోని రైతు భరోసా కేంద్రాలలోని వి ఏ ఏ ఏ ల  ద్వారా రైతులు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకుని, ఎవరెవరికి ఏమి కావాలో దాని ప్రకారమే నగదు చెల్లించి రసీదు పొందాలని సూచించారు. అనంతరం రైతులకు కావాల్సిన పచ్చిరొట్ట లేదా విత్తనాలను ఆయా ప్రాంతాల్లోని రైతు భరోసా కేంద్రాలకు ఏపీ సీడ్స్  వారి ద్వారా పొందేందుకు అవకాశం ఉందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు.అదే విధంగా పచ్చి రొట్ట వేసిన ప్రతి రైతు పంట నమోదు చేయించుకోవాలని, వాటిని సరి అయిన సమయంలో అనగా, 50 శాతం పూత దశలో కలియ దున్నాలి అని తెలిపారు .కనీసం 15రోజులు నీటిలో ము రగనివ్వాలి అని సూచించారు.ఇవి వేసిన పొలంలో మొదటి దఫా నత్రజని ఎరువులు తగ్గించాలని,రసాయనిక ఎరువులు 25 శాతం తగ్గించుకోవచ్చు అని వెంకటాచలం ఇంఛార్జి మండల వ్యవసాయ అధికారి  రాధ యడవల్లి తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో రైతులు  వ్యవసాయం,వ్యవసాయ అనుబంధ సేవలను ఆయా ప్రాంతాలలోని రైతు భరోసా కేంద్రాల ద్వారా పొందాలని రైతులకు అవగాహన కల్పించారు.

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

 

Tags:Farmer Assurance Awareness Trips in Palicharlapadu and Kuricharlapadu RBKs

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page