పాలిటెక్నిక్ ను కొనసాగించాలి

0 10

హైదరాబాద్ ముచ్చట్లు:

 

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్న కమలా నెహ్రూ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను ఎత్తివేసే కుట్రలను నిరసిస్తూ ఎగ్జిబిషన్ సొసైటీ ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్ధినిలు ఆందోళన చేపట్టారు. ఏబీవీపీ భాగ్యనగర్ విభాగ్ కన్వీనర్ కమల్ సురేష్ మాట్లాడుతూ *ఆసియా ఖండంలోనే మొట్టమొదటి మహిళా కళాశాల కమలా నెహ్రూ కళాశాల. రాష్ట్ర ప్రభుత్వం, ఎడ్యుకేషన్ సొసైటీ కళాశాలలను మూసి వేసే విషయంలో పునరాలోచన చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి. ఈ సంవత్సరం వెంటనే అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వాలి. విద్యా సంస్థలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ఆలోచించాలి కాని విద్యా సంస్థలను మూసి వేయడం దుర్మార్గం. నిధులు కేటాయించకుండా,  ఉపాధ్యాయుల భర్తీ చేయకుండా అధ్యాపకులు లేరనే సాకుతో  కళాశాల మూసివేయాలనుకోడం దారుణమని అన్నారు. పేద విద్యార్థులు చదువుకునేందుకు ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు వీలుగా ఉన్న కళాశాలకు అన్ని వసతులు కల్పించి కొనసాగించాలి.  కళాశాలను మూసివేస్తే ఊరుకునేది లేదు. కళాశాలను కాపాడుకునేందుకు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు.

 

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

 

Tags: Polytechnic should be continued

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page