పుంగనూరులో కరోనా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 187

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ కెఎల్‌.వర్మ హెచ్చరించారు. గురువారం సాయంత్రం మున్సిపాలిటిలో కోవిడ్‌ కమిటి సభ్యులు తహశీల్ధార్‌ వెంకట్రాయులు, ఎంపిడివో రాజేశ్వరి, మెడికల్‌ ఆఫీసర్‌ రెడ్డికార్తీక్‌తో కలసి సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ పుంగనూరులో కరోనాతీవ్రత ఉన్నందున లాక్‌డౌన్‌ను మధ్యాహ్నం వరకే సడలించామన్నారు. ప్రతి రోజు కరోనా రోగులు, మరణాల సంఖ్య కొనసాగుతూ ఉందన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు నిబంధనలు కఠినతరం చేశామన్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేసుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే మూడవ వేవ్‌కు భారీమూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలు మాస్క్లు ధరించి, భౌతికదూరం పాటించాలని, శానిటైజర్లు వినియోగించి, మూడవవేవ్‌ను నియంత్రించేలా ఆరోగ్యప్రమాణాలు పాటించాలని కోరారు.

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags: Strict action if corona rules are not followed in Punganur- Commissioner KL Verma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page