పుంగనూరులో 19న ఆర్మీ ఉద్యోగాలకు ఎంపిక -అక్కిసాని భాస్కర్‌రెడ్డి

0 500

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఆర్మీలో వివిధ రకాల ఉద్యోగాలకు ఎంపిక కార్యక్రమం ఈనెల 19న నిర్వహిస్తున్నట్లు మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఏఎంసి చైర్మన్‌ నాగరాజారెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల సూచనల మేరకు ఓఎస్‌డి దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌ఎస్‌.పేటలో గల బసవరాజ కళాశాల మైదానంలో ఎంపిక కార్యక్రమం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన నిరుద్యోగులు ఇప్పటి వరకు 2150 మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. ఆర్మీ ఉద్యోగాలకు అవసరమైన వారిని ఎంపిక చేసి, వారికి తిరుపతిలో ఎస్వీ డిఫెన్స్ అకాడమిలో రెండు నెలల శిక్షణ ఇప్పించేలా మంత్రి పెద్దిరెడ్డి ఏర్పాట్లు చేశారని తెలిపారు.ఈ ఎంపిక కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు , పార్టీ నాయకులు, అభిమానులు కృషి చేయాలని కోరారు.

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

 

Tags: Selection for Army jobs on 19th at Punganur – Akkisani Bhaskar Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page