పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

0 262

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గ పదవి స్వీకారం ఘనంగా నిర్వహించారు. పట్టణ సమీపంలోని రాక్‌వ్యాలి రిసార్ట్స్ లో డిస్ట్రిక్ట్ జోనల్‌ గవర్నర్‌గా డాక్టర్‌ శరణ్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మాజీ అధ్యక్షులు డాక్టర్‌ ప్రభాకర్‌, డాక్టర్‌ జాన్‌, పూలత్యాగరాజు, సిఎస్‌.రాజారెడ్డి, చైతన్య హాజరైయ్యారు. ఈ సందర్భంగా నూతన ప్రతినిధులకు డాక్టర్‌ శరణ్‌ ,అసిస్టెంట్‌ గవర్నర్‌ హేమచంద్రకు అధ్యక్షుడు భాస్కర్‌జెట్టి, కార్యదర్శి మధుసూదన్‌రెడ్డికి మెడల్స్ను పెట్టారు. ఈ సందర్భంగా నూతన ప్రతినిధులు మాట్లాడుతూ రోటరీక్లబ్‌ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రోటరీ ప్రతినిధులు సుధాకర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, భాస్కర్‌, పిఎల్‌.నవీన్‌, సురేష్‌, అంటోని, మురళి,అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: Punganur Rotary Club’s new working committee inaugurated

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page