పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

0 6

ఎల్బీనగర్ జోన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు
హైదరాబాద్  ముచ్చట్లు:

ఎల్బినగర్ జోన్ కాంట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు మున్వర్ హుస్సేన్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ జిహెచ్ఎంసి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎనిమిది నెలలుగా కాంట్రాక్టర్లతో తో పని చేయించుకుని ఇప్పటివరకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ కుటుంబాలు దీనస్థితిలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు నుంచి పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు కాంట్రాక్టర్ పనులు జిహెచ్ఎంసి పరిధిలో నిలిపివేస్తున్నామని అన్నారు.  తక్షణమే అధికారులు స్పందించి బిల్లు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జె చ్ఎంసీ పరిధి లో 500 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు.పనుల కోసం అప్పులు చేసి,బ్యాంకులో రుణాలు తీసుకొని కాంట్రాక్టు  పనులు నిర్వహిస్తున్నామని సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుందని కాంట్రాక్టర్ వాపోయారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు రామకృష్ణారెడ్డి,లింగారెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags:Pending bills must be paid immediately

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page