పోలీసుల వేషంలో దారి దోపిడీలు

0 12

చిత్తూరు  ముచ్చట్లు:
చిత్తూరు తాలుకా పోలీసు స్టేషన్ పరిధిలో దోపిడీలకు పాల్పడుతూ ఉన్న అంతరాష్ట్ర ముఠా  అరెస్టు చేశామని రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్  కే.బాలయ్య,తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు తాలుకా పోలీసు స్టేషన్ ఫరిది లో గల చిత్తూరు-వెల్లూరు రోడ్డు, రిలయన్స్ పెట్రోల్ బంకు సమీపంలో జరిగిన దోపిడీ, బంది పోటు నేరంలో పాల్గొనిన అంతరాష్ట్ర ముఠా అరెస్టు చేసి వారి నుండి  సొమ్ము స్వాధీన స్వాధీనపరుచుకున్నట్లు ఆయన మీడియాతో తెలిపారు. అలాగేసంచాలత్మకమైన ఈ కేసును చేధించుటకు చిత్తూరు జిల్లా ఎస్ పి సెంథిల్ కుమార్ ఐపిఎస్  చిత్తూరు డి.ఎస్.పి.సుధాకర్ రెడ్డి  ఆధ్వర్యంలోఎస్ బి.ఇన్స్పెక్టర్  చిత్తూరు1.టౌన్ ఎస్ ఐ. ఎం..అనిల్ కుమార్ లతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందన్నారు ..ఈ దర్యాప్తులో భాగంగా చిత్తూరు-వేలూరు రోడ్డు లో ఉన్న గోపాలపురం మిట్ట వద్ద వాహనములు తనికి లు నిర్వహిచడం జరిగినది. ఈ తనికిలలో కేసుకు సంబంధపడి ఉన్న 9 మంది ముద్దాయిలను అదుపులో తీసుకోని అరెస్టు చేసి వారి వద్ద నుండి 3 వాహనములు, 2 తుపాకులు, 2 లాఠీలు, తమిళనాడు పోలీసు దుస్తులు, రెండు ఇనుప రాడ్లు, 9 సెల్ ఫోన్ లను మరియు వారి వద్ద నున్న దోపిడీ కాబడిన సొమ్ము రూ.32 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నామని  తెలిపారు.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

 

- Advertisement -

Tags:Robberies leading up to police disguise

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page