ప్రతి భక్తుడిలో భగవంతుని చూడండి; నూతన ఉద్యోగులకు టీటీడీ జె ఈవో సదా భార్గవి పిలుపు

0 7

తిరుపతిముచ్చట్లు:

 

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కరుణతో  ఉద్యోగాలు పొందిన మీరు ప్రతి భక్తుడిలో భగవంతుని చూస్తూ సేవ చేయాలని టీటీడీ జెఈవో సదా భార్గవి పిలుపునిచ్చారు.
టీటీడీ లో ఒకే సారి కారుణ్య నియామకాలు పొందిన 119 మంది ఉద్యోగుల కు గురువారం శ్వేత లో శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. జెఈవో  సదా భార్గవి ఈ శిక్షణ కార్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వర స్వామి కల్పించిన ఈ అదృష్టాన్ని ఉద్యోగంగా కాకుండా స్వామి ఇచ్చిన సేవా భాగ్యంగా చూడాలన్నారు. ప్రతి ఉద్యోగి క్రమశిక్షణ,నిబద్ధత, చిత్తశుద్ధితో పని చేస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ అయిన టీటీడీకి మంచి పేరు తేవాలని కర్తవ్య బోధ చేశారు. సనాతన హిందూ సంస్కృతి, సంప్రదాయాన్ని అర్థం చేసుకుని భక్తులకు చక్కటి ఆతిథ్యం ఇస్తూ సేవ చేయాలన్నారు. టీటీడీ చట్టాలు, సర్వీస్ నిబంధనలు, ఆలయాల నిర్వహణ ఇతర అంశాల్లో నిపుణులు శిక్షణ ఇచ్చేలా కార్యక్రమం రూపొందించామని తెలిపారు. ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి మార్గదర్శకంలో నెల రోజుల్లోనే 119 మంది కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించామన్నారు. టీటీడీ చరిత్రలో ఇదో రికార్డ్ అని, ఇందుకోసం పని చేసిన అధికారులు, ఉద్యోగులకు శ్రీమతి సదా భార్గవి అభినందనలు తెలిపారు.  12 రోజుల పాటు వివిధ అంశాలపై నిర్వహించే శిక్షణా కార్యక్రమాలు ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.

- Advertisement -

చిన్మయ మిషన్ కడప జిల్లా శాఖ అధ్యక్షులు స్వామి
తురీయా నంద సరస్వతి మాట్లాడుతూ, జీతం కోసం ఉద్యోగం చేయరాదన్నారు. స్వామి వారు ఇచ్చిన ఈ భాగ్యాన్ని భక్తుల సేవకు ఉపయోగిస్తే ఆయన సంతోషిస్తారని అన్నారు. స్విమ్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వనజాక్షి మాట్లాడుతూ, మనిషి ప్రాణం పోయినా పరవాలేదని, విలువలు మాత్రం పోగొట్టుకోరాదన్నారు. ప్రతి ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నప్పుడే భక్తులకు, సంస్థకు మంచి సేవచేయగలుగుతారన్నారు. పురుషుల కంటే మహిళలకు కొన్ని అధిక శక్తులు ఉంటాయని, అందుకే మహిళను శక్తి స్వరూపంగా అభివర్ణిస్తారన్నారు. కుటుంబాన్ని, ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించే అవకాశం మహిళలకు ఉంటుందని, ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పని చేయాలని పిలుపునిచ్చారు. శ్వేత డైరెక్టర్ డాక్టర్ రామాంజులు రెడ్డి మాట్లాడుతూ, ఇది గోవిందుడు ఇచ్చిన అవకాశమన్నారు. శ్వేత విధులు, ప్రవర్తనా నియమావళిని వివరించారు. టీటీడీ విద్యావిభాగం డిప్యూటి ఈవో  గోవింద రాజన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

 

Tags:See God in every devotee; TTD J Evo Sada Bhargavi calls for new employees

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page