ప‌ల‌మ‌నేరు గోశాల‌లో దేశీయ గోజాతుల అభివృద్ధి : టిటిడి ఈవో

0 11

తిరుపతి ముచ్చట్లు:

 

టిటిడి ఆధ్వ‌ర్యంలో ప‌ల‌మ‌నేరులో ఏర్పాటుచేసిన గోశాల‌లో దేశీయ గోజాతుల‌ను అభివృద్ధి చేసి గోసంర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. గురువారం ప‌ల‌మ‌నేరులోని టిటిడి గోశాల‌ను ఈవో సంద‌ర్శించారు. దేశ‌వాళీ గోవుల‌ను, వృష‌భాల‌ను ప‌రిశీలించి ఏర్పాట్ల‌పై అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ప‌ల‌మ‌నేరులోని ఎస్వీ గోశాల‌కు పశువైద్య విశ్వ‌విద్యాల‌యం నుండి రాష్ట్ర ప్ర‌భుత్వం 450 ఎక‌రాలు కేటాయించింద‌న్నారు. ఇక్క‌డ దేశ‌వాళీ గోజాతుల‌ అభివృద్ధి, గో ఆధారిత పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల‌ త‌యారీ చేప‌డ‌తామ‌ని తెలిపారు. వీటిపై రైతులకు అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌ని, త‌ద్వారా రైతులకు ఆర్థికంగా లాభ‌సాటిగా ఉంటుంద‌ని చెప్పారు. ఇక్క‌డి గోశాల‌కు వెయ్యికి పైగా దేశీయ గోవులు, వృష‌భాలు ఉన్నాయ‌ని, తిరుప‌తిలోని గోశాల నుండి మ‌రో వెయ్యి గోవుల‌ను త‌ర‌లిస్తామ‌ని వెల్ల‌డించారు. ఇందుకోసం అవ‌స‌ర‌మ‌య్యే షెడ్లు త‌దిత‌ర నిర్మాణాలు చేప‌ట్టాల‌ని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామ‌న్నారు. గోశాల చుట్టూ ర‌క్ష‌ణ కంచె ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఈ గోశాల‌ను వాట‌ర్‌షెడ్‌గా ప‌రిగ‌ణించి గ్రామీణాభివృద్ధి శాఖ స‌హ‌కారంతో మ‌రింత అభివృద్ధి చేప‌డ‌తామ‌ని చెప్పారు. కార్పొరేట్ సంస్థ‌లు, దాత‌లు ఈ గోశాల‌లో మౌలిక వ‌స‌తులు పెంచేందుకు ముందుకు రావాల‌ని కోరారు. అదేవిధంగా, అంకిత‌భావం గ‌ల నిపుణులైన శాస్త్రవేత్త‌లు ముందుకొచ్చి దేశీయ గోజాతుల‌ను అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరారు.ఈఓ వెంట టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు, గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, ఎస్ఇజ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఇఇ  శివ‌రామ‌కృష్ణ త‌దిత‌రులు ఉన్నారు.

 

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: Development of Indigenous Goats in Palimaner Goshas: TTD Evo

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page