బోదకాలు, నట్టల నివారణ మాత్రలు పంపిణీ

0 13

మందమర్రి  ముచ్చట్లు:

మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల వార్డుల్లో, గ్రామాల్లో ఫైలేరియా, బోదకాలు, నట్టల నియంత్రణ విటమిన్ మాత్రలపంపిణీ కార్యక్రమాన్ని జిల్లా జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ప్రభుత్వ డాక్టర్ శైలజతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామూహిక బోధవ్యాధి, నట్టల నివారణ విటమిన్ మాత్రల పంపిణీ కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగుతుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో రెండు సంవత్సరాలు పైబడిన వారందరికీ డి ఈ సి, ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తారని వీటిని గర్భిణీ స్త్రీలకు అలాగే రెండు సంవత్సరాల లోపు పిల్లలకు, లివర్ క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి వేయరని తెలిపారు.ఈ మాత్రలు వాడటం వలన ఫైలేరియా వ్యాధి కూడా రాకుండా నివారించవచ్చని వారు అన్నారు. అందరూ తప్పనిసరిగా మాత్రలు వేసుకోవాల అని వారు కోరారు. ఈ కార్యక్రమాన్ని పట్టణంలోని దీపం నగర్ లో జెడ్పి చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ప్రారంభించగా మేడారం గ్రామంలో  వైద్యాధికారి శైలజ, జెడ్పిటిసి వేల్పుల రవి, ఎంపీటీసీ రాజ్కుమార్, సర్పంచ్ తిరుపతి రెడ్డి, ఆదిల్ పేట్ గ్రామంలో ఎంపీపీ గుర్రం గౌడ్, లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు శ్రీనివాస్, మల్లిక మేరీ అంజలిన, ఏఎన్ఎం సంధ్యారాణి, సుశీల,గ్లోరి, పద్మావతి,ఆశాలు పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

Tags; Distribution of instruction and nutrient repellent tablets

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page