బోయకొండలో పరుగులు తీస్తున్న అభివృద్ది- పనులనుపరిశీలించిన పెద్దిరెడ్డి

0 33

– బోయకొండను ఆదర్శంగా తీర్చిదిద్దడమే మంత్రి పెద్దిరెడ్డిలక్ష్యం
– మౌళికవతులతో భక్తులకు సదుపాయాలు
-కొత్త హంగులు రూపుదిద్దుకొంటున్న బోయకొండ

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

జిల్లాలో నాల్గవ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయంను అతి సుందరంగా,ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు. గురువారం ఆలయ కమిటి చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణతో కలిసి పెద్దిరెడ్డి బోయకొండలో ఉపాధి నిధులతో ఏర్పాటుచేస్తున్న పార్క్ పనులను, రోడ్లు, షాపింగ్‌ కాంప్లెక్స్,పుష్కరిణి ఏర్పాటు పనులను పరిశీలించారు. ఈ సంధర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఆధ్వర్యంలో బోయకొండలో అభివ్య్యృధ్దిపనులు పరుగులు పెడుతూ చురుగ్గా సాగుతున్నాయన్నారు. భక్తులకు అవసరమైన సదుపాయాలు, వసతుల కల్పనకు పెద్దపీట వేశామని, కోట్లాది రూపాయల వ్యయంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, రెండు నెలల కాలంలో పనులన్నీ పూర్తిచేసేలా చర్యలు తీసుకొన్నట్లు వివరించారు. భక్తులకు మౌళిక వసతులతోపాటు నీరు, నీడ, మరుగుదొడ్లు వసతులు, షెల్టర్‌తోపాటు పర్యాటక క్షేత్రంను తలపించేలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం పొందేలా తగు చర్యలు తీసుకొన్నట్లు చెప్పారు. మాస్టర్‌ప్లాన్‌లో రూపొందించిన మేరకు భక్తులకు సౌకర్యంగా కోట్లాది రూపాయలతో పలు అభివ్యృధ్ది పనులకు స్వీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. ఆలయం వద్ద స్రుంధరంగా ఆకర్షణీయంగా పార్క్ను ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ పూల వెహోక్కలు నాటేలా చర్యలు తీసుకొంటున్నట్లు చెప్పారు. నాణ్యతా ప్రమాణాలను పాటించి త్వరగా పూర్తిచేసేలా చూడాలని సూచించారు. బోయకొండకు కొత్తదనం రూపుదిద్దుకోనుంది.అలాగే బోయకొండలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఈఓ చంద్రమౌళి,మంత్రి పిఏ తుకారం , సోమల మల్లికార్జునరెడ్డి,పిఆర్‌ డిఈఈ ప్రసాద్‌, ఏఈ పురుషోత్తం, కాంట్రాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి తదితరులున్నారు.

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: Peddireddy examines the development and work being done in Boyakonda

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page