బ్రిటీష్ కాలం నాటి దేశ‌ద్రోహ చట్టం ఇప్పుడు అవసరమా?  కేంద్ర ప్రభుత్వాన్ని త‌ప్పుప‌ట్టిన  సుప్రీంకోర్టు

0 11


న్యూఢిల్లీ  ముచ్చట్లు:
బ్రిటీష్ కాలం నాటి దేశ‌ద్రోహ చ‌ట్టాన్ని సుప్రీంకోర్టు త‌ప్పుప‌ట్టింది. అది వలసవాదుల కాలంనాటి చట్టమని, అది ఇప్పుడు కొనసాగించడం మనకు అవసరమా? అని కేంద్రాన్ని ఉద్దేశిస్తూ సుప్రీం కోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ‌ద్రోహ చ‌ట్టాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంలో దాఖ‌లైన కేసులో కోర్టు ఈ ర‌కంగా స్పందించింది. ‘అది బ్రిటీష్‌కాలం నాటిదని, అప్పట్లో మ‌హాత్మా గాంధీ, బాల్ గంగాధ‌ర్ తిల‌క్ లాంటి వారిపై ఆ కేసుల‌ను పెట్టార‌ని కోర్టు తెలిపింది. అలాంటి సమరయోధులను నిలువరించేందుకు బ్రిటిష్‌వాళ్లు ఆ చట్టం(ఐపీసీ సెక్షన్‌ 124-ఎ) తీసుకొచ్చారని, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల తర్వాత కూడా ఆ వలస చట్టం మనకు అవసరమా?’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ, కేంద్రాన్ని ప్రశ్నించారు. సెడిషన్‌ లా(దేశద్రోహ చట్టం) చెల్లుబాటును పరిశీలిస్తామని స్పష్టం చేస్తూనే.. కేంద్రం నుంచి వివరణ కోరింది అత్యున్నత న్యాయస్థానం. ఆ చ‌ట్టాన్ని స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌పై వాడిన‌ట్లు కేంద్రానికి కోర్టు తెలిపింది. స్వాతంత్య్ర పోరాటాన్ని అణిచివేసేందుకు దేశ‌ద్రోహ చ‌ట్టాన్ని బ్రిటీష‌ర్లు వాడిన‌ట్లు కోర్టు పేర్కొన్న‌ది. మ‌హాత్మా గాంధీ, బాల్ గంగాధ‌ర్ తిల‌క్ లాంటి వారిపై ఆ కేసుల‌ను పెట్టార‌ని కోర్టు తెలిపింది. 75 ఏళ్ల స్వాతంత్య్రం త‌ర్వాత ఇలాంటి చ‌ట్టం అవ‌స‌ర‌మా అని కోర్టు పేర్కొన్న‌ది. దేశ‌ద్రోహ చ‌ట్టాన్ని స‌వాల్ చేస్తే అనేక పిటీష‌న్లు దాఖ‌లైన‌ట్లు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ తెలిపారు. అన్నింటినీ ఒకేసారి విచారిస్తామ‌ని కోర్టు తెలిపింది. ఆ చ‌ట్టాన్ని దుర్వినియోగం చేస్తార‌న్న‌దే త‌మ ఆందోళ‌న అని చీఫ్ జ‌స్టిస్ తెలిపారు. అంతేకాదు ఇదొక ప్రమాదకరమైన అంశమని అభివర్ణిస్తూ.. బాధ్యతారాహిత్యంగా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని ప్రధాన న్యాయమూర్తి రమణ వ్యాఖ్యానించారు. దేశంలో రాజద్రోహం/దేశద్రోహం చట్టం కింద కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

- Advertisement -

Tags:Is the sedition law of the British era necessary now?
The Supreme Court misjudged the Central Government

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page