రాజద్రోహం కేసు పిచ్చోడి చేతిలో రాయి

0 17

న్యూఢిల్లీ,ముచ్చట్లు:

 

రాజద్రోహం చట్టం కింద కేసులు నమోదుచేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. గురువారం నాటి విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయులను అణచివేయడానికి బ్రిటిష్ పాలకులు ఈ చట్టాన్ని తీసుకొచ్చారని వ్యాఖ్యనించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటిందని, ఇక ఈ చట్టం అవసరమా? అని నిలదీశారు. దేశ ద్రోహం చట్టం బ్రిటన్ నుంచి తెచ్చుకున్న వలస చట్టమని అన్నారు.‘గాంధీ, తిలక్‌కు వ్యతిరేకంగా దేశద్రోహం చట్టాన్ని వాడారు.. రాజద్రోహం కింద పెడుతున్న కేసులెన్ని.. ఎన్ని నిలబడుతున్నాయి.. పేకాట ఆడేవారిపై సెక్షన్ 124 కింద కేసులు పెడుతున్నారు.. బెయిల్ రాకుండా కక్షసాధింపు చర్యలకు దిగుతారు.. అధికారదాహంతో కక్షసాధింపులకు పాల్పడుతున్నారు.. వ్యవస్థలను, వ్యక్తులను బెదిరించేస్థాయికి దిగజారుతున్నారు.. ఫ్యాక్షనిస్టులూ ప్రత్యర్థులపై రాజద్రోహం మోపేలా వ్యవహరిస్తున్నారు.. ప్రయోజనం కంటే దుర్వినియోగమే ఎక్కువగా ఉంది’ అని వ్యాఖ్యానించారు.‘రాజద్రోహం చట్టంలోని సెక్షన్ 124 ఏ పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది.

 

 

 

 

- Advertisement -

ప్రత్యర్థులపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు. వ్యవస్థలు, వ్యక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. దుర్వినియోగం గురించి ఎందుకు ఆలోచించడం లేదు.. రాజద్రోహం చట్టం విషయంలో కేంద్రం పునరాలోచించాలని, సెక్షన్ 124 కింద కేసులన్నీ ఒకేసారి విచారిస్తాం’ అని సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.దేశద్రోహం చట్టాన్ని సవాల్ చేస్తూ రిటైర్డ్‌ ఆర్మీ జనరల్‌ ఎస్‌.జి.వాంబాత్కరే పిటిషన్‌ దాఖలు చేశారు. భారతీయ శిక్షా స్మృతి (ఇండియన్‌ పీనల్‌ కోడ్‌)లో దేశద్రోహం చట్టం ఇప్పటికీ తన ఉనికిని చాటుకోవడానికి 60ఏళ్ల నాటి తీర్పే కారణమని, ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఆ తీర్పును సమీక్షించాల్సిన అవసరం ఉందని పిటిషనర్ వాదించారు1962లో కేదార్‌నాథ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బ్రిటిష్ కాలం నాటి అవశేషమైన సెక్షన్‌ 124ఏ (దేశద్రోహం)ను సమర్ధించింది.

 

 

 

 

భావ ప్రకటనా స్వేచ్ఛపై ‘చిల్లింగ్‌ ఎఫెక్ట్‌ (మానసిక అవరోధాలు)’ వంటి సిద్ధాంతాలు, సూత్రీకరణలను వినిపించుకోని కాలం అది. అప్పటికి ఆ సిద్ధాంతం పెద్దగా అభివృద్ధి చెందలేదు. 2015 నుంచి భావ ప్రకటనా స్వేచ్ఛపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ‘శ్రేయ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసుతో ఇది మరోసారి ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది’ అని పిటిషనర్‌ పేర్కొన్నారు.కేదార్‌నాథ్‌ తీర్పు వెలువడే నాటికి సమానత్వం, పరువు, ప్రతిష్ట వంటి ప్రాథమిక హక్కుల మధ్య అంతర్గసంబంధం తగినంతగా విస్తరించడానికి బదులు కుదించబడిందని పిటిషనర్‌ వాదించారు. సెక్షన్‌ 124ఏ లేకపోతే, ప్రభుత్వంలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు యావత్‌ దేశం అనిశ్చితిలో పడదా అని కోర్టు ప్రశ్నించిందిస్వాతంత్ర్య సమరయోధులకు వ్యతిరేకంగా బ్రిటీష్‌ వారు ఈ చట్టం తీసుకొచ్చారు. భారతీయుల అణచివేతకు తెల్లదొరలు దీన్ని ఉపయోగించారు. గాంధీ, తిలక్‌ వంటివారిని ఈ చట్టంతోనే అణచివేయాలని చూశారు.

 

 

 

 

ఇప్పుడు మనకు స్వాత్రంత్యం వచ్చి 75ఏళ్లు అవుతోంది. ఇప్పుడు కూడా దేశద్రోహం చట్టం అవసరమా’’ అని చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ కేంద్రాన్ని ప్రశ్నించారు.రాజద్రోహం చట్టం కింద పెడుతున్న కేసులెన్ని? వాటిలో నిలబడుతున్నవెన్ని? ఈ చట్టం దుర్వినియోగం గురించి ఎందుకు ఆలోచించట్లేదు? పేకాట ఆడేవారిపైనా కూడా రాజద్రోహం కేసులు పెడుతున్నారు. బెయిల్‌ రాకుండా కక్ష సాధింపుకు దిగుతున్నారు.. అధికారదాహంతో బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. వ్యవస్థలు, వ్యక్తులను బెదిరించే స్థాయికి దిగజారుతున్నార అని జస్టిస్‌ రమణ కామెంట్స్ చేశారు. ఈ సెక్షన్‌ రాజ్యంగా చెల్లుబాటును సవాల్‌ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయని, వీటన్నింటినీ ఒకేసారి విచారిస్తామని పేర్కొన్నారు.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: The treason case is a stone in Pichhodi’s hand

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page