లారీ యజమానికి బెదిరించిన విలేకరులు ఆరెస్టు

0 17

కొత్తపేట     ముచ్చట్లు:
బియ్యం లారీని ఆపి  రెండు  లక్షల రూపాయలు డిమాండ్ చేసిన ఏడురు విలేకరులపై రావులపాలెం పోలీసులు కేసు నమోదు చేసారు. బుధవారం తెల్లవారుజామున 16వ నెంబర్ జాతీయ రహదారిపై రావులపాలెం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదురుగా ప్రింట్,  ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు అంటూ గుంటూరుకు చెందిన ఒక బియ్యం లారీని ఆపి రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేసారు. లేని పక్షంలో  లారీని పౌరసరఫరాల శాఖకు సంబంధించిన బియ్యం గా కేసు నమోదు చేయించి మిమ్మల్ని జైలుకు పంపిస్తామని బెదిరించారు. దాంతో సరుకు యజమాని  పోలీసులకు  ఫిర్యాదు చేసాడు. దాంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  ఆకొండి  వీర వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి (పశ్చిమ వాహిని  తిరుపతి),   చిర్రా నాగరాజు  (ఆర్టీఐ యాక్టు న్యూస్ ఛానల్), అయినవిల్లి విజయ్ బాబు (అనంత వాయిస్ తెలుగు దినపత్రిక),  ఉందుర్తి రవికుమార్ (డీఆర్ ఎస్ యూట్యాబ్ ఛానల్), పలివెల రాజు (జై జనని తెలుగు  దినపత్రిక),  ఉమ్మిడిశెట్టి వెంకరేశ్వరరావు (గోదావరి తెలుగు దినపత్రిక), సీహెచ్  రాజేంద్రప్రసాద్ (వి 10  ఛానల్)లపు కొత్తపేట కోర్టులో హాజరుపరిచనున్నట్లు డిఎస్పీ వై. మాధవరెడ్డి తెలిపారు.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

- Advertisement -

Tags:Arrest of reporters who threatened Larry’s owner

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page