వామపక్ష నేతలు ఆరెస్టు

0 10

విజయవాడ    ముచ్చట్లు:

 

- Advertisement -

ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను పెంపు, చెత్త పన్ను కు నిరసనగా విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న సిపిఎం, సిపిఐ కార్యకర్తలను పోలీసులు  అరెస్టులు చేసారు.  సిపిఎం నేతలు సిహెచ్ బాబూరావు, డి.కాశీనాథ్ బి.రమణ రావు, జి.ఆదిలక్ష్మి, సూరిబాబు కృష్ణ,  శ్రీనివాస్, సీపీఐ నేత డి.శంకర్ తదితరులను అరెస్టు చేసి కృష్ణలంక, గవర్నర్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. గత రాత్రి నుండి పలువురు నేతలను గృహనిర్బంధం చేస్తూ నోటీసులు జారీ చేసారు. కౌన్సిల్లో చెత్త పన్ను ను ఆమోదిస్తే ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని వామపక్ష నేతలు హెచ్చరించారు.  అక్రమ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించారు.  ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags:Leftist leaders arrested

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page