విశాఖ లో స్లీపర్ సెల్స్

0 14

విశాఖపట్టణం ముచ్చట్లు:

దేశం మీద ఉగ్ర కన్ను పడింది. అత్యాధునిక సాంకేతిక సంపత్తితో విరుచుకుపడేందుకు ఉగ్రవాదులు చూస్తున్నారు. దాయాది పాకిస్థాన్ ఆర్మీ ఉగ్రవాదులకు టెక్నాలజీ విషయంలో సాయం చేస్తోంది అన్న అనుమానాలూ ఉన్నాయి. వెనకాతల తోడేలు లాంటి చైనా తోడు కూడా ఉందని చెబుతారు. మొత్తానికి సరిహద్దుల్లో డ్రోన్ల దాడులు పెరిగాయి. వాటి ద్వారా బాంబు దాడులకు పాల్పడుతూ ఇండియాను అస్థిరపరచాలన్నది ఉగ్ర మూకల స్ట్రాటజీ. ఈ విషయంలో భారత సైన్యం అప్రమత్తమైనప్పటికీ యాంటీ డ్రోన్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారానే వీటికి అడ్డుకట్ట పడుతుందని దౌత్య రంగ నిపుణులు చెబుతున్నారు.ఉమ్మడి ఏపీలో హైదరాబాద్, విశాఖపట్నాలను వ్యూహాత్మకమైన ప్రాంతాలుగా రక్షణ రంగ నిపుణులు పేర్కొనేవారు. దాదాపుగా కోటి మంది జనాభా నివసించే భాగ్యనగరంలో ఉగ్ర ముప్పు ఎపుడూ పొంచి ఉంటూనే ఉంది. స్లీపింగ్ సెల్స్ అక్కడ అడుగడుగునా ఉన్నాయన్న అనుమానాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో మాలిక్ బ్రదర్స్ ఆసిఫ్ నగర్ లో అరెస్ట్ కావడం, దర్బంగా పార్సిల్ బాంబు లింక్స్ మూలాలు ఇక్కడివే అని తేలడంతో హైదరాబాద్ మరోమారు ఉలిక్కిపడుతోంది. ఈ రోజున అన్ని రకాలుగా హైదరాబాద్ విస్తరించి ఉంది. దాంతో ఉగ్ర అలజడికి అది ఒక వ్యూహాత్మకమైన ప్రాంతంగా రక్షణ రంగం అనుమానిస్తోంది. ఆ తరువాత జాబితాలో విశాఖ పేరు కూడా ఉందిట.హైదరాబాద్ తరువాత విశాఖ పేరే నాడూ చెప్పేవారు. పాతిక లక్షల పై దాటిన జనాభాతో మినీ ఇండియాగా విశాఖ ఉంది. ఇక్కడ తూర్పు నావికా దళంతో పాటు అనేక కీలకమైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. ఇక ఉగ్ర కన్ను ఇటు వైపుగా కూడా ఉంటుందని అనుమానాలు ఉన్నాయి. 1971లో పాకిస్థాన్ సైన్యం విశాఖ మీదుగా దూసుకువచ్చిన ఘటన కూడా ఉంది. సముద్రతీర ప్రాంతం కావడంతో ముంబై తరువాత విశాఖ మీద అటెన్షన్ ఉంటుందని అంటారు. ఇక విభజన ఏపీలో నాటి చంద్రబాబు సర్కార్ విశాఖను ఆర్ధిక రాజధానిగా ప్రకటిస్తే నేటి జగన్ ప్రభుత్వం ఏకంగా పాలనా రాజధానిని చేసింది. దాంతో విశాఖకు రాజకీయంగా కూడా ప్రాముఖ్యత బాగా పెరిగింది.దేశంలో ఎక్కడ ఉగ్ర తాకిడి కనిపించినా విశాఖ కూడా దానికి అనుగుణంగా అలెర్ట్ అవుతుంది. విశాఖలో రక్షణ రంగ విభాగాలు కూడా ఉండడంతో అంతా అలెర్ట్ అవుతారు. ప్రస్తుతం కూడా విశాఖ అప్రమత్తమవుతోంది. ఉగ్ర దాడులు కానీ, మరే రకమైన అలజడులు కానీ సంభవించే అవకాశాలు ఎక్కువగా ప్రధాన నగరాలలోనే ఉంటాయి. దాంతో స్ట్రాటజిక్ స్పాట్ గా విశాఖను కూడా రక్షణ రంగం భావిస్తోంది. ఈ నేపధ్యంలో విశాఖలోనూ అనుమానితిల కదలికలపైన ఆరాలు మొదలయ్యాయి. ఏది ఏమైనా కూడా ఉగ్ర ముప్పు అన్నది ఎటు నుంచి ఎటైనా ఉంటుంది కాబట్టి విశాఖ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రక్షణ రంగ నిపుణులు కూడా సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విశాఖ రెండూ కూడా ఎపుడూ అప్రమత్తంగానే ఉండాలన్నది వారి ఆలోచన.

 

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags:Sleeper cells in Visakhapatnam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page