111 దేశాల్లో డెల్టా వేరియంట్

0 19

న్యూఢిల్లీముచ్చట్లు:

 

కరోనా మహమ్మారి ఏ ముహూర్తన మొదలయ్యిందో గానీ.. ఏడాదిన్నరగా ప్రపంచానికి కంటిమీద కునుకే కరువయ్యింది. మహమ్మారి జన్యూ మార్పులకు గురై కొత్తరూపంలో దాడిచేస్తోంది. మహమ్మారి ముప్పుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి హెచ్చరికలు చేసింది. థర్డ్ వేవ్ ముప్పు ముంగిట ఉన్నామని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథ్నామ్ ఘ్యాబ్రియోసిస్ గురువారం హెచ్చరించారు. దురదృష్టవశాత్తూ.. థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉన్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.డెల్టా వేరియంట్ ముప్పు ఇంకా తొలగిపోలేదని.. ఈ వేరియంట్‌తో ముడిపడిన కేసులు అన్ని ప్రాంతాల్లోనూ పెరుగుతున్నాయని బుధవారం వెల్లడించిన వీక్లీ నివేదికలో డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఏప్రిల్ 13 నాటికి 111 దేశాల్లో ఈ వేరియంట్ ఉనికి ఉందని, మున్ముందు ఇది మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. డెల్టా వేరియంట్ వ్యాప్తిని సామాజిక చైతన్యం, సమర్ధవంతమైన ప్రజారోగ్య చర్యల ద్వారా అడ్డుకోవాలని సూచించింది. పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాలు రెండింటిలోనూ పెరుగుదల నమోదవుతున్నాయని చెప్పింది.ఐరోపా, ఉత్తర అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత కోవిడ్ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి.. కానీ, ప్రస్తుతం పరిస్థితి తారుమారవుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వైరస్ అభివృద్ధి చెందుతూనే ఉందని, దీని ఫలితంగా మరింత వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్‌లు పుట్టుకొస్తున్నాయని టెడ్రోస్ అన్నారు. డెల్టా వేరియంట్ ఇప్పుడు 111కి పైగా దేశాలకు వ్యాపించింది. కాకపోతే ఇది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కోవిడ్ వేరియంట్‌గా ఉంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.డబ్ల్యూహెచ్ఓ పరిధిలోని ఆరు రీజియన్లలో వరుసగా నాలుగు వారాల నుంచి కోవిడ్ కేసులు పెరుగుతునే ఉన్నాయి. అలాగే పది వారాలు తగ్గిన మరణాలు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రాణాలను రక్షించే వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రపంచంలో కొనసాగుతున్న దిగ్భ్రాంతికరమైన అసమానతను కోవిడ్ అత్యవసర కమిటీ గుర్తించిందని టెడ్రోస్ అన్నారు.ఈ అసమానత రెండు ట్రాక్‌లను సృష్టించిందని ఆయన పునరుద్ఘాటించారు. వ్యాక్సిన్లు అత్యధికంగా కలిగి ఉన్న దేశాలు ఆంక్షలను ఎత్తివేసి, వారి సమాజాలను తిరిగి తెరుస్తున్నారు.. రెండోది వ్యాక్సిన్లు అందని దేశాలు వైరస్ దయపై భారం వేశాయని అన్నారు. చాలా దేశాలు ఇప్పటి వరకూ ఎటువంటి టీకాలను పొందలేదని అన్నారు. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ప్రతి దేశం తన జనాభాలో కనీసం 10 శాతం మందికి, డిసెంబరుకు 40 శాతం మందికి, 2022 మధ్య నాటికి 70 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని పునరుద్ఘాటించారుఅయితే, వ్యాక్సిన్లు ఒక్కటే మహమ్మారిని ఆపలేవని, అనుకూలమైన, స్థిరమైన విధానంతో దేశాలు ముందుకు వెళ్లాలని సూచించారు. భౌతికదూరం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించి.. ఆరోగ్య మౌలిక సదుపాయాలను కల్పించాలని తెలిపారు. పలు దేశాలు ఇటువంటి చర్యలతోనే కోవిడ్-19ను అడ్డుకుంటున్నాయని గుర్తుచేశారు.

 

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags:Delta variant in 111 countries

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page