56 వేలు కాలు… లక్షా 91 వేలు

0 17

హైదరాబాద్ ముచ్చట్లు:

 

ఇంధన ధరల విషయంలో ఛలో రాజ్ భవన్‌కు తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. రేపు ఇందిరా పార్క్ నుంచి ఈ ర్యాలీ సాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. దేశంలో అందరూ మోడీ బారినపడ్డ వారేనంటూ ఆయన ఎద్దేవా చేశారు. రూ.40కి రావాల్సిన పెట్రోల్‌ను రూ.104కి అమ్ముతున్నారని రేవంత్ ఆరోపించారు. రూ.30 కేసీఆర్, రూ.30 మోడీ దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం మెడలు వంచాలంటే, జనం రోడ్డు ఎక్కాల్సిందేనని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పేదల కోసం పార్లమెంట్‌లో కొట్లాడుతామని ఆయన స్పష్టం చేశారు.సీఎం కేసీఆర్ పెద్ద మోసానికి మాస్టర్ ప్లాన్ వేశారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ ఖాళీలపై సర్కస్ ఫీట్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఖాళీలు ఎన్నో తేల్చాలని అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి చేస్తున్న హడావుడి మరో మోసానికి మాస్టర్ ప్లాన్‌లా ఉందని రేవంత్ ఆరోపించారు. 2020 డిసెంబర్‌లో బిస్వాల్ కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదిక ప్రకారం 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు అధికారికంగా స్పష్టమైందని అన్నారు.ఆ నివేదిక ఉండగా కొత్తగా లెక్కలు తేల్చేదేంటి అని రేవంత్ రెడ్డి నిలదీశారు. వాస్తవంగా 1.91 లక్షల ఖాళీలు ఉండగా.. 56 వేలు దాటడం లేదన్నట్టు దొంగ లెక్కలేంటని ప్రశ్నించారు. వివిధ కార్పొరేషన్లలో ఖాళీల సంఖ్య లెక్క తీయాలని.. అన్నింటిపైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు.

 

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: 56 finger leg … 91 lakh finger

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page