అందుబాటులోకి జనరిక్ మందులు

0 17

మెదక్ ముచ్చట్లు:
డాక్టర్లు రాసేది ఒకటి మెడికల్‌ షాప్‌లో ఇచ్చేది ఒకటి అన్నట్టుగా మెడికల్‌, ఫార్మసీల్లో జరుగుతున్నది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. దీనిలో భాగంగానే ములుగు మండలం లోని వంటిమామిడి హైవే పక్కన ఉన్న లక్ష్మక్క పల్లి లో ఉన్నటువంటి ఆర్‌వీఎం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ హాస్పిటల్‌కి నిత్యం ఇతర జిల్లాల నుండి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఉన్నత వైద్యం కోసం వందల సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆసుపత్రి ఫార్మసీలో జనరిక్‌ మందుల విక్రయాలను జోరుగా నిర్వహిస్తున్నారు. బ్రాండెడ్‌ మందుల పేరుతో జనరిక్‌ ముందులను ఇస్తూ జనాల జేబులకు చిల్లు పెడుతున్నారు. అతి తక్కువ ధరకు అందించాల్సిన జనరిక్‌ మందులను బ్రాండెడ్‌ ధరలకే విక్రయిస్తూ సామాన్యులను మోసం చేస్తున్నారు.

 

ఈ మందులు అమ్మకాలపై వైద్య ఆరోగ్య శాఖ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని సరిగ్గా పాటించడం లేదు. జనరిక్‌ అమ్మకాలను నిర్వహిస్తూ కాసుల గడిస్తున్నారు. బ్రాండెడ్‌ ఫార్ములాతో నాన్‌ బ్రాండెడ్‌ మందులను జనరిక్‌ మెడిసిన్‌గా నివారణ మందుల ధరలకు విక్రయిస్తున్నారు. జనరిక్‌ మందులు తక్కువ ధరకు లభించడంతో పాటు వాటికి సుమారు 70శాతం మార్జిన్‌ ఉంటుంది. అదే ఒరిజినల్‌ మందులకు 20 శాతం మార్జిన్‌ మాత్రమే ఉంటుంది. మీనాజీపేట్‌ గ్రామానికి చెందిన సుజాత అనే మహిళ ఈఎన్‌టి (చెవి సమస్య)తో ఆర్‌విఎం ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఉన్నటువంటి ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌ రోగిని పరీక్షించి మందులు రాసి ఇచ్చారు. అవి ఈ విధంగా ఉన్నాయి.
టాక్సీమ్‌ 10 మాత్రలు, లీవో సిట్రిజిన్‌, జీరోడల్‌-పి, రానిటాక్‌, రాసారు (బ్రాండెడ్‌ మందులు) డాక్టర్‌ ఈ విధంగా రాయగా ఫార్మసీ సిబ్బంది బక్టో ఫిక్స్‌ 200 (జనారిక్‌ ధర 50) (అమ్మిన ధర 100రూ), జిట్టాక్‌ (జనారిక్‌ ధర 4 రూ) (అమ్మిన ధర 8రూ), ఎలెర్జ్‌-ఎం ( జనరిక్‌ ధర 20రూ) (అమ్మిన ధర 44 రూ) (అసైక్లో ఫినెక్‌ జనారిక్‌ ధర 7రూ) (అమ్మిన ధర 50 రూ)జనారిక్‌ ధర ప్రకారం చూస్తే ఈ మందులకు 81 రూపాయలు అవుతాయి కానీ ఈ మందులకు బ్రాండెడ్‌ ధరలు వేయగా 202 రూపాయలు అయ్యాయి అంటే 121 రూపాయలు ఎక్కువ వసూలు చేశారు. మందులకు సంబంధించిన బిల్‌ అడిగితే ప్రింటర్‌ పనిచేయడం లేదని అంటున్నారు మాన్యువల్‌ గా రాసి ఇవ్వండి అని అడిగితే మీ ఇష్టం ఉంటే ముందు తీసుకోండి లేకపోతే వెళ్ళండి అంటూ ఫార్మసి సిబ్బంది రోగులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, జిల్లా వ్యాప్తంగా పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో ఈ విధంగానే జరుగుతోంది. ఇప్పటికైనా ఆస్పత్రి యజమాన్యం, వైధ్యాధికారులు చర్యలు తీసుకొని రోగులకు నాణ్యమైన మందులు అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:Generic drugs available

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page