అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం- ఎస్ఐ రవీంద్రబాబు

0 91

రామసముద్రం ముచ్చట్లు:

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు రామసముద్రం ఎస్ఐ రవీంద్రబాబు అన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించే ప్రసక్తేలేదన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పేకాట, కర్ణాటక మద్యం తదితర వాటిపై ప్రజలు రహస్య సమాచారం అందిస్తే వారి పేరు గోప్యంగా ఉంచుతామన్నారు. రామసముద్రం కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉండడంతో అక్రమంగా మధ్యం రవాణా నియంత్రణకు సీఐ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని చెక్ పోస్టుల్లో నిఘా పెంచుతామన్నారు. అంతేకాకుండా యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తన దృష్టికి తీసుకొస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన సూచించారు. తమ సిబ్బందితో కలిసి గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజలతో పోలీసులకు సత్సంబంధాలు ఉండేలా చూస్తామన్నారు. ప్రజలు కూడా పోలీసులకు అసాంఘిక కార్యకలాపాలపై సమాచారాలు ఎప్పటికప్పుడు అందిస్తే శాంతి భద్రతలకు అఘాతం కలగకుండా చేసుకుంటామని ఆయన ప్రజలను కోరారు.

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

Tags:Steel foot on unscrupulous activities- SI Ravindrababu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page