ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీలపై  పార్లమెంటులో ఎంపీలు గళం విప్పాలి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు నాగ మధు యాదవ్

0 6

పార్లమెంట్ సమావేశాలలో ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకుని రావాలి

ఎమ్మిగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించి, విభజన హామీలు అమలు చేయాలనే వివిధ అంశాలను ఆంధ్ర ప్రదేశ్ ఎంపీలు ఈనెల 19 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు గళం విప్పాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు నాగ మధు యాదవ్ శుక్రవారం స్థానిక కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం లో ఉన్న బిజెపి రాష్ట్రంలో ఉన్న వైసిపి పార్టీలు తీరని అన్యాయం చేస్తున్నాయని, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పిన ఈ ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా పై హామీతో  గెలిచిన 22 మంది వైస్సార్సీపీ  ఎంపీలు ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పోరాడాలన్నారు . ప్రత్యేక హోదా రావడం తో పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మొదటి సంతకం హోదా పై చేస్తారని కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమని తెలిపారు.
జాబ్ క్యాలెండర్ ,జల వివాద సమస్యలు పరిష్కరించాలి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసిన జాబ్ లెస్ క్యాలెండర్ ను  వెనక్కితీసుకొని, అన్ని రకాల పోస్టుల భర్తీ తోమరొక క్యాలెండర్ను విడుదల చేయాలని, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో జల వివాద సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ  వసతిగృహాల రాష్ట్ర కన్వీనర్ వీరేష్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి ధోని బాల రాజు, మన్సూర్, మహేశ్వరయ్య, బాలు,రమేష్, అజయ్, చంద్రశేఖర్ ,తదితరులు పాల్గొన్నారు..

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:MPs in Parliament should open the door on special status and secession guarantees for Andhra Pradesh
NSUI state president Naga Madhu Yadav

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page