ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తే కేటీఆర్ మొగోడు అనుకుంటాం

0 13

‘‘తెలంగాణ నా గడ్డ.. ఇది రియాలిటీ’’
వైఎస్‌ చనిపోయాకే తెలంగాణ మలిదశ ఉద్యమం
వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల
హైదరాబాద్  ముచ్చట్లు:

- Advertisement -

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియా సమావేశం లో మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖ‌ర్‌రెడ్డి ముమ్మాటికీ తెలంగాణ వ్యతిరేకి కాదని షర్మిల స్పష్టం చేశారు.  వైఎస్‌ చనిపోయాకే తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైందని తెలిపారు. మా నాన్న ప్రేమించిన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతోందని షర్మిల అన్నారు. ‘‘తెలంగాణ నా గడ్డ.. ఇది రియాలిటీ’’ అని తెలిపారు. ప్రజల కోసం నిలబడే.. పోరాడే పార్టీ వైఎస్సార్‌ టీపీ అని స్పష్టం చేశారు. అలిగితే పుట్టింటికి వెళ్లకుండా పార్టీ పెడతామా అని ప్రశ్నించారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరుగుతుందా అని నిలదీశారు. ‘కేటీఆర్ దృష్టిలో మహిళలు అంటే వంటింట్లో ఉండాలి.. వ్రతాలు చేసుకోవాలనేగా అర్థం.. అంతేనా..?. అధికార పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడైనా మహిళలు కనిపిస్తారా..?. నిరుద్యోగుల కోసం అన్నం మెతుకు ముట్టుకోకుండా మేం వ్రతం చేస్తున్నాం. పెద్ద మొగోడు కదా కేటీఆర్.. ఏం చేస్తున్నారు..? తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాల్సి ఉంది. ఉద్యోగాలు భర్తీ చేస్తే మా వ్రతం ఫలించింది అనుకుంటాం. కేటీఆర్ మొగోడు అనుకుంటాం’ అని షర్మిల చెప్పుకొచ్చారు. కేటీఆర్ గురించి విలేకరులు ప్రశ్నించగా అసలు కేటీఆర్ అంటే ఎవరు..? అని విలేకరులనే రివర్స్ ప్రశ్నించారు. ఆ తర్వాత పక్కనుండే మరో నేత ఆయనే మేడమ్.. సీఎం కేసీఆర్ కొడుకు కల్వకుంట్ల తారకరామారావు అని చెప్పగా షర్మిల నవ్వుకున్నారు. అనంతరం ప్రెస్‌మీట్ కొనసాగించిన ఆమె.. మహిళలకు కేబినెట్‌లో ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రశ్నించారు. వైఎస్‌ తెలంగాణకు మంచి చేశారా..ద్రోహం చేశారా..గ్రామాలకు వెళ్లి అడగాలని అన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది.. పెట్టామని వైఎస్సార్‌ టీపీ అధినేత తెలిపారు. కృష్ణా జలాల అంశాలను కేసీఆర్‌ ఏనాడైనా సీరియస్‌గా తీసుకున్నారా అడిగారు. సమావేశాలకు పిలిస్తే పోవాల్సిన బాధ్యత లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు దక్కాల్సిన చుక్క నీటిబొట్టును వదులుకోమని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లో ఎంత మంది మహిళలున్నారని.. మీటింగ్‌ జరిగితే మహిళా సర్పంచ్‌కు కూడా కుర్చీ ఇవ్వరని విమర్శించారు. కేసీఆర్ దృష్టిలో మహిళలంటే వంటింట్లో ఉండాలని..వ్రతాలు చేసుకోవాలి షర్మిల వ్యాఖ్యానించారు. షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు.. ముఖ్యంగా కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:Suppose KTR moves if all jobs are replaced

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page