ఉద్రిక్తంగా మారిన ఛలో రాజ్ భవన్

0 3

హైదరాబాద్ ముచ్చట్లు:

ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరవుతున్న కార్యకర్తలను, నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్ట్‌లకు దిగారు. ముందుగా అనుమతి తీసుకుని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అడ్డుకోవడం ఏంటని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.పోలీసులు కార్యకర్తలు, నాయకులను అడ్డుకునే క్రమంలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులకు దొరక్కుండా పరిగెత్తిన కొందరిని పోలీసులు కూడా పరిగెత్తి అరెస్టు చేశారు. రేవంత్‌ రెడ్డి ట్విటర్‌లో షేర్‌ చేసిన ఓ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. దీనిలో ఇందిరా పార్క్‌ దగ్గర నిరసన తెలపుతున్న వెంకట్‌ బల్మూర్‌ అనే కాంగ్రెస్‌ కార్యకర్తను పోలీసులు రోడ్డు మీద పరిగెత్తించి మరీ అరెస్టు చేశారు. ఒక్క వ్యక్తిని అరెస్ట్‌ చేయడం కోసం దాదాపు ఏడేనిమిది మంది పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం వెంకట్‌ని బలవంతంగా అక్కడ నుంచి అదుపులోకి తీసుకున్నారు.ఈయన అరెస్టుకు సంబంధించిన వీడియోను రేవంత్ రెడ్డి ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘‘పోలీసులు దారుణ ప్రవర్తనకు నిదర్శనం ఈ వీడియో. ముందస్తు అనుమతితో శాంతియుతంగా నిరసన చేస్తున్న కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. పోలీసులు టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు గులాం గిరి చేస్తున్నారు’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. తమకు మోదీ, కేసీఆర్ మీద నమ్మకం లేదని అన్నారు. హ్యాకర్లతో ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నారని మండిపడ్డారు. వచ్చేది సోనియా రాజ్యమని.. అది కాంగ్రెస్ కార్యకర్తల రాజ్యమని రేవంత్ స్పష్టం చేశారు. కనీసం గవర్నర్ అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వకపోవడం ఏంటని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

Tags:Chalo Raj Bhavan turned tense

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page