ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోలుకోవాలని చిన్నాపూర్ లో పూజలు

0 7

త్వరగా ప్రజాసేవలో నిమగ్నం కావాలని నేతల అఖాంక్ష

జగిత్యాల ముచ్చట్లు:

 

- Advertisement -

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం బుగ్గారం  మండలం చిన్నపూర్  గ్రామంలోని హనుమాన్ ఆలయానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు ఇటీవల జీవన్ రెడ్డీకి  కరోన సోకగా హైదరాబాద్ లో చికిత్స పొంది  జగిత్యాలకు తిరిగివచ్చి హోం క్వారంటైన్లో ఉంటున్నారని త్వరగా కోలుకొని ప్రజాసేవలో నిమగ్నం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తున్న జీవన్ రెడ్డి కరోనాను జయించి త్వరగా కోలుకోవాలని నాయకులు అఖంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ చిన్నాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు వంతడుపుల చారి,  పూజల కనకయ్య, ఎనగంటి దుర్గాప్రసాద్,చందయ్యపల్లె మాజీ ఉప సర్పంచ్ గాదె శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు…

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

Tags:Pujas in Chinnapur to recover MLC Jeevan Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page