కబాడీ పాలెంలో 3 విడతలుగా ఆనందయ్య మందు పంపిణీ

0 10

నెల్లూరు  ముచ్చట్లు:
స్థానిక 51 వ డివిజన్ కపాడిపాళెం నందు ఆనందయ్య  కరోనా నివారణ మందు 3 విడతలుగా బొణిగి ఆనందయ్య పంపిణీ చేశారు.కపాడిపాళెం(కె.పి.) హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యములో ఆనందయ్య  కరోనా నివారణ మందును ఆనందయ్య  జన్మదిన సంబరాలు చేయడం జరిగింది.అనంతరం 3వ  విడతగా  కపాడిపాళ్ళెం , పెద్దబావి సెంటర్ నందు ఆనందయ్య   మందు ఆనందయ్య చేతుల మీదుగా  పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆనందయ్యని కపాడిపాళ్ళెం హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.  అనంతరం మందు పంపిణీ ఈ కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , కరోనా విలయతాండవం చేస్తూ , ప్రపంచ దేశాలను వణికించిన తరుణంలో , శాస్త్ర విజ్ణానులు సైతం చేతులెత్తేసిన తరుణంలో మేము నివారణ మందు తయారు చేసి ప్రజలందరికి ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. పేద మధ్యతరగతి  కుటుంబాలు నివసిస్తున్న కపాడిపాళ్ళెంలో నివారణమందు పంపిణీ చేయాలని కపాడిపాళ్ళెం(కె.పి.) హెల్పింగ్ హ్యాండ్ వారి అభ్యర్ధన మేరకు కపాడీ పాలెం లో మందుపంపిణీకు కెపి హవల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు మమ్ములను సంప్రదించారని , వారి అభ్యర్ధన మేరకు 3 విడతలుగా మందు పంపిణీ చేయడం జరిగిందన్నారు. భవిష్యత్ లో మేము మరిన్నీ వ్యాధులకు మందు తయారు చేసి ప్రజలందరికి ఉచితంగా పంపిణీ చేస్తామని దానికి ప్రజలందరి మద్దతు మాకు కావాలని కోరారు. ఈ సందర్భంగా కపాడిపాళ్ళెం హెల్పింగ్ హ్యాండ్స్ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో  కపాడిపాళ్లెం హెల్పింగ్ హ్యాండ్స్  ప్రతినిధులు,  నిర్వాహకులు కైలాసం సతీష్ , ఆదిత్య , కావాలి సతీష్, ,చందవరం  వెంకటేష్వర్లు చార్లీ , జయరాజ్ , లజపతి తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

- Advertisement -

Tags:Distribution of Anandayya medicine in 3 installments in Kabaddi farm

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page