కాంగ్రెస్ నేతల ముందస్తు ఆరెస్టు

0 1

సూర్యాపేట  ముచ్చట్లు:

కోదాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కోదాడ పట్టణ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ అది స్థానం పిలుపునివ్వడంతో… పట్టణంలో ఉన్న 50 మంది కాంగ్రెస్ నాయకులను కోదాడ టౌన్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వలన దేశ వ్యాప్తంగా పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్రఇబ్బందులకు గురి అవుతున్నారని, కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరు కలిసి ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం వలన ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. పెంచిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను వెంటనే వెనెక్కి తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:Preliminary arrest of Congress leaders

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page