కేటీఆర్ ఎవరు…  షర్మిల ప్రశ్న

0 8

హైదరాబాద్  ముచ్చట్లు:
కేటీఆర్ అంటే ఎవరు.. తెలంగాణ రాష్ట్రానికి ఐటీ మంత్రి, అంతకుమించి ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనంటే తెలియని వారుండరు. కానీ రాజన్న బిడ్డ షర్మిలకు మాత్రం కేటీఆర్ ఎవరో తెలియదంట. అవును నిజమే.. శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ అంటే ఎవరు? అని ఆమె అడగడంతో పార్టీ నేతలతో పాటు విలేకరులు కంగుతిన్నారు. కేసీఆర్ సర్కారు పాలనపై షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో విలేకరులు కేటీఆర్ గురించి ఏదో ప్రశ్న అడగ్గా.. కేటీఆరా… ఆయనెవరు? అంటూ తనకు తెలియదన్నట్లుగా మాట్లాడారు. పక్కనే ఉన్న ఓ నేత.. కల్వకుంట్ల తారక రామారావు గారు మేడమ్ అని చెప్పగా… ఓహ్.. కేసీఆర్ గారి కొడుకా? అని నవ్వారు. షర్మిల వ్యాఖ్యలతో అక్కడున్న నేతలు, విలేకరులు కూడా నవ్వారు.ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. తండ్రి కేసీఆర్‌లాగే కేటీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్ పెద్ద మొగోడు కదా.. మరి మహిళలు, నిరుద్యోగులకు ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. కేటీఆర్‌కు దమ్ముంటే రాష్ట్రంలో ఖాళీవున్న ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు మీడియా మీట్ నిర్వహించిన ఆమె.. కేటీఆర్ గురించి విలేకరులు ప్రశ్నించగా అసలు కేటీఆర్ అంటే ఎవరు..? అని విలేకరులనే రివర్స్ ప్రశ్నించారు. కేటీఆర్ గారి దృష్టిలో మహిళలు అంటే వంటింట్లో ఉండాలి.. వ్రతాలు చేసుకోవాలనేగా అర్థం.. అంతేనా..?. అధికార పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడైనా మహిళలు కనిపిస్తారా..?. నిరుద్యోగుల కోసం అన్నం మెతుకు ముట్టుకోకుండా మేం వ్రతం చేస్తున్నాం. పెద్ద మొగోడు కదా కేటీఆర్.. ఏం చేస్తున్నారు..? తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాల్సి ఉంది. ఉద్యోగాలు భర్తీ చేస్తే మా వ్రతం ఫలించింది అనుకుంటాం. కేటీఆర్ మొగోడు అనుకుంటాం’ అని షర్మిల చెప్పుకొచ్చారు. షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు.. ముఖ్యంగా కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.
చుక్క నీరు వదులుకోం
కృష్ణ, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీరు కూడా వదులుకోమని తేల్చి చెప్పారు వైఎస్సార్‌టీపీ అధినాయకురాలు వైఎస్ షర్మిల. ఉద్యమంలో పాల్గొనని వాళ్లకు తెలంగాణ పై ప్రేమ లేనట్టా? అని ప్రశ్నించిన ఆమె, తెలంగాణ ఏర్పాటు అవసరం అని చెప్పామని గుర్తు చేసుకున్నారు. “నక్కతోక చూపెట్టి పులి.. పులి అంటున్నారు. అలిగితే పుట్టింటికి వెళ్లడం మానేస్తారు కానీ.. పార్టీ పెట్టరు. విభేదించి పెట్టిన పార్టీ కాదు. ప్రజల పై ప్రేమ తో పెట్టిన పార్టీ ఇది.” అని ఆమె తన పార్టీ ఏర్పాటుకు దోహదం చేసిన అంశాల్ని గురించి షర్మిల వివరించారు.“సింహం సింగిల్ గా ఉందని బయపడకండి.. నేను ఒంటరిని కాను. జంపింగ్ జపాంగ్స్ నాకు అవసరం లేదు. జగన్, కెసిఆర్ ఇద్దరూ స్నేహితులే.. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు.. పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చింది వైఎస్సార్. కాంగ్రెస్ వైఎస్ కు వెన్నుపోటు పొడిచింది. కాంగ్రెస్ కి సిగ్గులేదు. ఆస్తులు కాపాడుకోవడానికి ఉన్న రాజకీయ నాయకులు నాకు వద్దు. ప్రజల నుండి నేను నాయకులు తెచ్చుకుంట. చులకన చేయడం భావ్యం కాదు. ప్రభంజనం సృష్టిస్తా.. రాసి పెట్టుకోండి. ” అని షర్మిల హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

- Advertisement -

Tags:Who is KTR … Sharmila’s question

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page