గెజిట్ పై ఆంధ్ర సై.. తెలంగాణ నై

0 8

విజయవాడ ముచ్చట్లు:

 

కృష్ణా జలాలకు సంబంధించి కేంద్రం గెజిట్ విడుదల చేయడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు బాలినేని శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్ స్పందించారు. ఈ మేరకు కామెంట్స్ చేశారు. తొలుత ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన బాలినేని.. కేంద్రం రాష్ట్రాలకు తండ్రి వంటిదని, ఇద్దరు పిల్లలు గొడవ పడుతుంటే తండ్రి న్యాయం చేసే విధంగా కేంద్రం నీటి పంపకాల విషయంలో గెజిట్ విడుదల చేసిందని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంలో ఏమాత్రం తప్పు లేదన్నారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై మంత్రి బాలినేని శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణా ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తుంటే మాట్లాడని చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేవిధంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే కేసీఆర్‌ ఓటుకు నోటు కేసు ముందుకు తీసుకువస్తారని చంద్రబాబుకు భయం పట్టుకుందని విమర్శించారు. ఇదిసమయంలో కేంద్ర గెజిట్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఎన్నికల కోసమో.. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొనేందుకో నీటి వివాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు చట్టబద్దంగా, న్యాయబద్దంగా రావాల్సిన గ్లాసు నీటిని కూడా వదులుకోబోమని మంత్రి సురేష్ తేల్చి చెప్పారు. అలాగే ఒక్క గ్లాసు కూడా తమకు ఎక్కువ అవసరం లేదని వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాలకు సమానంగా, న్యాయబద్దంగా నీటిని తరలించాలనేదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్ష అని పేర్కొన్నారు. కేంద్రం సరైన సమయంలో.. సరైన ప్రకటన విడుదల చేసిందని మంత్రి సురేష్ పేర్కొన్నారు.

 

 

 

- Advertisement -

తెలంగాణ నైవిభజన చట్టం ప్రకారమే కృష్ణ, గోదావరి నదీ జలాల బోర్డుల నోటిఫికేషన్ జరిగిందని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు పెరగకుండా కేంద్రం కృష్ణా, గోదావరి బోర్డులను నోటిఫై చేయడం ఉపయోగపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిని.. నీటి కేటాయింపుల విషయంగా చూడకూడదన్న ఆయన, ఇప్పటికే కేటాయించిన నీటిని బోర్డుల ద్వారా జరిగే నిర్వహణగా చూడాలన్నారు.విద్యుత్ ఉత్పత్తి, అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారని పరస్పరం ఇరు తెలుగు రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాస్తున్న నేపథ్యంలో కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసిందని రఘునందన్ రావు వివరణ ఇచ్చారు. రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకోవడం, వివాదాలు పెద్దవి చేయకూడదనే కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆయన వివరించారు. నదీ జలాల విషయాన్ని తెలంగాణ రాజకీయం చేయాలనుకుంటుందని దుబ్బాక ఎమ్మెల్యే విమర్శించారు.తెలంగాణా నీటి ప్రయోజనాల విషయంలో ఏడేళ్ళు మాట్లాడకుండా మౌనంగా ఉందని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసిన రఘునందన్ రావు, 2015 లో కృష్ణ నదీజలాల వాటాను ఏపీకి 66% తెలంగాణాకి 34% కింద హరీశ్ రావు ఒప్పుకున్నారు కాబట్టే.. ఇప్పుడు కేంద్రాన్ని అడగడానికి ఆయనకు ముఖం చెల్లడం లేదని రఘునందన్ రావు అన్నారు. నీటి విషయంలో తెలంగాణ బీజేపీని బద్నాం చేయాలని టిఆర్ఎస్ చూస్తుందని ఆయన విమర్శించారు.ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు, సమస్యల పరిష్కారం కోసం అపెక్స్ కౌన్సిల్ ముందుకు వచ్చి తమ వాదాన్ని కేసీఆర్ సర్కారు వినిపించాలన్నారు. ఇప్పటి వరకు జల వివాదాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్రం జోక్యం తరువాత మాటమార్చి సుప్రీంకోర్టుకు వెళ్తామంటున్నారని, ప్రజాస్వామ్య బద్దంగా తెలంగాణా ప్రభుత్వం తీసుకునే ఏ చర్యనైనా తాము స్వాగతిస్తామని ఆయన తెలిపారు.

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags: Andhra Sai on Gazette .. Telangana Nai

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page