చౌడేపల్లె లో తొలగనున్న ట్రాఫిక్‌ కష్టాలు

0 49

– చౌడేపల్లె నుంచి కల్లూరు వరకు రోడ్డుఅభివృద్దిపనులు
– రోడ్డును సర్వేచేసి, మార్కింగ్‌ వేసిన సర్వేయర్లు
– త్వరలో పనులు ప్రారంభం

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

కొన్నేళ్లుగా చౌడేపల్లెలో ఇరుకు రోడ్లతో అవస్థలు పడుతున్న ప్రజలు, ప్రయాణీకులకు, వాహనదారులకు ట్రాఫిక్‌ కష్టాలు తొలగనున్నాయి. శుక్రవారం మండల సర్వేయర్‌ హరిప్రసాద్‌ సచివాలయ సర్వేయర్ల బృందం కలిసి చౌడేపల్లె మోటారు వీధి లో సర్వేను ప్రారంభించారు. అన్ని ప్రాంతాలు అభివృధ్ది చెందుతున్న సమయంలో చౌడేపల్లె నుంచి తిరుపతి,చిత్తూరు, కడప తదితర ప్రాంతాల వైపుకు పుంగనూరునుంచి నిత్యం అధిక సంఖ్యలో వాహనాల రాకపోకలు చౌడేపల్లె మీదుగా వెళ్తుంటారు. పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. చౌడేపల్లెలో రోడ్లు వెడల్పు తక్కువగా ఉన్నకారణంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గుతుండేంది. ఈక్రమంలో చౌడేపల్లెనుంచి కల్లూరు వరకు రోడ్లు వెడల్పుచేయడం, అభివృద్దిచేసేందుకు ప్రభుత్వం స్వీకారం చుట్టింది. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు అధికారులు రికార్డుల ఆధారంగా సర్వే నిర్వహించి మార్గింగ్‌ వేశారు. ఆక్రమిత దారులు ప్రభుత్వస్థలంను ఆక్రమించుకొన్న ప్రాంతాన్ని గుర్తించి సహరిహద్దు లను నిర్థేశించారు. ఆక్రమిత స్థలాన్ని స్వచ్చందంగా ప్రజలు వదిలేస్తామని చెప్పడంతో అధికారులు మార్కింగ్‌ వేసి సూచనలిచ్చారు.ప్రభుత్వ సూచనలమేరకు రోడ్లు అభివృద్ది పనులు త్వరలో ప్రారంభం అవుతుండడంతో చౌడేపల్లెకు కొత్తదనం రానుంది. ఈ కార్యక్రమంలో సర్వేయర్లు మురళీకృష్ణ, మధుసూధన్‌,చంద్ర, పద్మజ, మణి తదితరులున్నారు.

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags: Traffic congestion to be eliminated in Choudepalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page