జిల్లాలో కురుస్తున్న వర్షాల పై అప్రమత్తంగా ఉండాలి-జిల్లా కలెక్టర్ జి.రవి

0 3

జగిత్యాలముచ్చట్లు:

జిల్లాలో కురుస్తున్న వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,  జిల్లా, డివిజన్, మున్సిపల్ మండల, గ్రామ స్థాయిలో అధికారులు సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ గోగులోత్ రవి అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం నుండి కలెక్టర్ రవి , జిల్లా ఎస్పీ సింధుశర్మ లతో కలసి వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ కోరుట్ల మండలం తోపాటు, మల్లాపూర్ మండలంలో  వర్షాల వలన కొంతమంది ఇబ్బందులు పడ్డారని, కోరుట్ల పట్టణంలో ఒకరు గల్లతవగా అధికారులు చాకచక్యంగా వ్యవహరించి కాపాడారని అభినందించారు.  అన్ని స్థాయిలలో అధికారులు అప్రమత్తంగా వ్యవహిరించాలని,  నీటిప్రవాహంతో మునిగిపోయో రహదారులను గుర్తించి అటువైపుగా ప్రజలు ప్రయాణం చేయకుండా చూడాలని, ఎవరైన వెళ్లడానికి ప్రయత్నిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.  తాత్కళిక ప్రత్యామ్నాయ మార్గాలను ఎర్పాటు చేసి ప్రజలకు తెలియజేయాలని,  లోతట్టు ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా ఏర్పాటు చేసి, వారికి మంచినీరు, ఆహరం అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. పల్లె, ప్రగతి కార్యక్రమాల ద్వారా గుర్తించిన నివాసయెగ్యం కాని ఇళ్లు, గోడలను పంచాయితి, మున్సిపలిటిలలో తొలగించేలా చూడాలని పేర్కోన్నారు.  ఎక్కడ కూడా నీరు నిలిచిపోకుండా ట్రెంచ్, మెటార్ లను ఏర్పాటు చేసి నీరు తొలగించాలని చూడాలని, వర్షాల వలన మురుగుకాలువలలో చెత్తనిండిపోయె అవకాశం ఉన్నందున ప్రతిరోజు కాలువలను శుభ్రం చేసి అంటు వ్యాధులు ప్రబలకుండా అయిల్ బాల్స్ వేసి తగు చర్యలు చేపట్టాలని సూచించారు.  అధికారులు ఎప్పుడు అందుబాటులో  స్థానికంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు జిల్లాలో ఉన్న చెరువులు కుంటలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటి స్థితిగతులను మేరకు ఇసుక బస్తాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. మున్సిపల్, గ్రామపంచాయితీలలో  అవసరమయ్యే లైఫ్ జాకెట్స్, ఎయిర్ బొట్లు మొదలగు వాటిని ముందుగానే సమకూర్చుకోవాలి అన్నారు.  గజఈతగాళ్ల వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని,  విద్యూత్ శాఖ అధికారులు వర్షాకాలంలో వైర్లు తెగిపడి ప్రాణ, జంతు నష్టం కలుగకుండా, లూస్ వైర్లను గుర్తించి వాటని వెంటనే పునరద్దిరించాలని, వరద ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని, అవసరం ఉన్నచోట్ల తాత్కాలిక విద్యుత్ సరఫరా అందించాలని ఆన్నారు.
గ్రామస్థాయిలో యువతను, ప్రజాప్రతినిధుల ద్వారా లోతట్టు ప్రాంతాలను గుర్తించి, నీటి ప్రవాహన్ని బట్టి అక్కడి ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా చూడడంతో పాటు, అవసరమైతే పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించేలా చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. మండల, గ్రామస్థాయిలో అవసరమగు చర్యలుతీసుకోవాలని తెలియచేశారు. కలెక్టరేట్లో 24/7 అందుబాటులో ఉండే విదంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేసామని, అధికారుల  ఫోన్ నెంబర్లను కూడా అందుబాటులో వుండే లా చూడాలని, పోలాల్లో వర్షాల వలన పంటనష్టం కలుగకుండా నీటిని పోలాల నుండి తోలగించేలా రైతులకు వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పించాలని,  ప్రాణ, ఆస్థి, జంతు నష్టాలు కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని, కాలువల ద్వారా నీటిని దిగువప్రాతాలకు తరలించేలా గేట్లు  తెరిచే ముందు సమాచారం అందించి ముందుస్తు చర్యలను తీసుకోవాలని అన్నారు.   అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయలని సూచించారు.ఆనంతరం జిల్లా ఎస్పీ సిందుశర్మ మాట్లాడుతూ, వాగులు పొంగి ప్రవహించడం, రోడ్డు మార్గాలు ముగిపోయె అకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందుస్తు చర్యలు తీసుకోవాలని,  ఎటువంటి అనుకోని సంఘటన్లు జరుగకుండా అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రజలు ఎవరు కూడా చేపల వేటకు,రోడ్డు దాటడానికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.  అధికారులు ప్రజలను అప్రమత్తంగా వ్యహరించాలని,  సిబ్బంది అందుబాటులో లేనిచోట ప్రజప్రతినిధులు, వాలంటీర్ల ద్వారా సహయక  బృందాలుగా ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  నీటి ప్రవాహం తక్కుగా ఉందని బావించి ఆ ప్రాంతాల నుండి ప్రయాణాలు జరుగకుండా చూడాలని, వాహనాల రాకపోకల కొరకు  తాత్కాళిక మార్గాలను ఏర్పాటు  చేయాలని,  రాత్రి సమయంలో రోడ్లపై చెట్లు పడిపోవడం,  విద్యూత్ తీగలు పడిపోవడం జరగితే వెంటనే స్పందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఎవరైన నీటి ప్రవాహంలో చిక్కుకున్నట్లయితే పై అధికారుల అదేశాలకై వేచి చూడకుండా వారికి తక్షణ సహయాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్  అరుణ శ్రీ, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవో లు
మధూరి ,వినోద్ కుమార్,అన్ని మండలాల తహసీల్దార్లు,ఎం.పి.డి.ఓ.లు పోలీస్ అధికారులు ,డిపిఓ, డిఏవో, పంచాయతీ రాజ్, మున్సిపల్, విద్యుత్ శాఖ, ఫిషరీస్ శాఖ ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

Tags:District Collector G. Ravi should be alert about the rains in the district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page