జులై 30న విడుద‌లవుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ `ఇప్పుడు కాక ఇంకెప్పుడు`

0 22

సినిమా   ముచ్చట్లు:
ఈ మధ్యకాలంలో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు భారీ ఆదరణ దక్కుతోంది. ఇదే బాటలో చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా పెరిగిన అబ్బాయికి, అలాగే అబ్బాయిలకు దూరంగా పెరిగిన అమ్మాయికి మధ్య జరిగిన రొమాంటిక్ జర్నీ క‌థ‌తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా  రూపొందుతోన్న చిత్రం  `ఇప్పుడు కాక ఇంకెప్పుడు`. హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటించారు. త‌నికెళ్ల భ‌ర‌ణి కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా  చింతా రాజశేఖర్ రెడ్డి సమర్పణలో చింతా గోపాలకృష్ణ (గోపి) నిర్మిస్తున్నాడు. వై.యుగంధర్ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌కి, టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ చిత్రాన్ని జులై 30న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌.
తారాగ‌ణం: హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ,త‌నికెళ్ల భ‌ర‌ణి

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

- Advertisement -

Tags:Youthful Entertainer is set to release on July 30

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page