నిబంధనలకు తూట్లు – “‘మీ సేవ”‘ దుర్వినియోగం

0 11

రెవెన్యూ అధికారుల అండదండలు
– ఆధారాలు లేకుండానే రికార్డుల్లో  భూమి మార్పిడి
కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఎకరం
అదనంగా తల్లి పేరున 31గుంటల భూమి ఎక్కించుకున్న తనయుడు
బుగ్గారం “‘మీ సేవ”‘ యజమాని నిర్వాకం ఇది
చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలి
తహసీల్దార్ ను, పోలీసులను ఆశ్రయించిన ఓ రైతు

జగిత్యాలముచ్చట్లు:

- Advertisement -

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం కేంద్రానికి చెందిన  ఓ వ్యక్తి మీ సేవ నిర్వహిస్తూ మీసేవ చేయాల్సిన “‘సేవలను”‘ స్వార్థ పూరితంగా, దుర్వినియోగం చేసి, రెవెన్యూ అధికారులతో పాటు సిబ్బంది అండదండలతో తన కుటుంబ సభ్యుల పేరున ఇతరుల భూమిని నమోదు చేయించుకున్నాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరైన ఆధారాలు ఉంటేనే సేవలు అందించాల్సిన మీసేవ నిర్వాహకుడు తన చేతిలో పనే కదా అని స్వార్థ పూరితంగా తప్పుడు పనులు చేసి ఇతరుల భూమిని కాజేయడం సంచలనం సృష్టిస్తోంది.మీ సేవ నిర్వహకుడిగా రెవెన్యూ అధికారులతో తనకున్న సంబంధాలను ఇలా స్వార్థానికి కూడా వాడుకొని తప్పు పనులు చేయడం ఏమిటని, ఇలాంటి వారికి రెవెన్యూ అధికారులు కూడా సహకరించడం చట్టరీత్యా నేరమే కదా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. తనకు ఎలాంటి సమాచారం లేకుండా, తన సంతకాలు లేకుండా, ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా రెవెన్యూ రికార్డుల్లో ఇతరుల పేరున మార్చబడిన తన భూమి తనకు నమోదు చేసి తప్పు చేసిన అధికారులతో పాటు సిబ్బందిపై, నిబంధనలకు విరుద్ధంగా మీసేవ చేయాల్సిన సేవలను దుర్వినియోగం చేసి స్వార్థంతో మోసాలకు పాల్పడ్డ మీసేవ సెంటర్ పై, సంబందిత నిర్వహకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత రైతు కళ్లెం చిన్నయ్య అధికారులను కోరారు.కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కూడా ఆ రైతు ఆశ్రయించాడు.
బుగ్గారం మండల తహసీల్దార్ కు, పోలీసులకు పిర్యాదు చేసిన అనంతరంబాధిత రైతు కళ్లెం చిన్నయ్య శుక్రవారం విలేఖరులతో మాట్లాడారు. సిరివంచకోట శివారులో సర్వే నంబర్ 330అ. లో ఒక ఎకరం 4 గుంటలు (1.04 ఎకరాలు) సర్వే నం.330ఆ.  లో 27 గుంటల భూమి గత 40 ఏండ్ల క్రితం కొనుగులు చేసి పట్టా పొందానని చిన్నయ్య అన్నారు. బుగ్గారం లోని మీ సేవ నిర్వాహకుడు మొగిలి సుదన్ తన వద్ద సర్వే నంబర్ 330అ. లో ఒక ఎకరం భూమి కొనుగోలు చేసి 2017 జూన్ 15న జగిత్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని తెలిపారు.
తాను కొనుగోలు చేసిన ఎకరం భూమిని తన పేరున అనగా మొగిలి సుదన్ పేరున రెవెన్యూశాఖ రికార్డుల్లో మార్చుకున్నారు. కళ్లెం చిన్నయ్య పేరున మిగిలి ఉండాల్సిన సర్వే నంబర్ 330అ. లో మిగిలిన 4 గుంటలు, సర్వే నంబర్ 330ఆ. లో 27 గుంటలు, మొత్తం 31 గుంటల భూమిని కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా తన పేరు నుండి మొగిలి సుదన్ అతని తల్లి మొగిలి రాజవ్వ పేరున రెవెన్యూ రికార్డుల్లో మార్చుకున్నారని చిన్నయ్య ఆరోపించారు. మొగిలి రాజవ్వ కు తాను భూమి అమ్మలేదని, ఎలాంటి పత్రాలు కూడా వ్రాసి ఇవ్వలేదన్నారు. ఎలాగూ మీసేవ తన చేతిలో ఉందని, మీ సేవ చేయాల్సిన సేవలను దుర్వినియోగం చేస్తూ, రెవెన్యూశాఖ అధికారులను కూడా మచ్చిక చేసుకొని మోసపూరితంగా, ఉద్దేశ్య పూర్వకంగా తన భూమిని మొగిలి సుదన్ అనే వ్యక్తి రెవెన్యూ రికార్డుల్లో ఆయన తల్లి మొగిలి రాజవ్వ పేరున మార్పించాడని కళ్లెం చిన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 2020 జూన్ 23న మొదటిసారి, 2021 జాన్ 8న రెండవ సారి, నేడు మూడోసారి మండల తహసీల్దార్ కు విజ్ఞాపన పత్రాలు అందజేసి తన భూమి తనకు రికార్డుల్లో నమోదు చేసి న్యాయం చేయాలని కోరినట్లు బాధిత రైతు కళ్లెం చిన్నయ్య పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, సేవలను స్వార్థంతో దుర్వినియోగం చేసి భూ మార్పులకు దరఖాస్తు చేసిన మీసేవ పై,  మోసాలకు పాల్పడ్డ మొగిలి సుదన్ పై, అతనికి సహకరించిన అప్పటి రెవెన్యూ అధికారులతో పాటు సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కళ్లెం చిన్నయ్య బుగ్గారం
మండల తహసీల్దార్ ను,  పోలీస్ అధికారులను కూడా కోరినట్లు తెలిపారు.

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:Leaks to the Terms – Abuse of “‘Your Service’ ‘

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page