పుంగనూరులో 19న జరిగే ఆర్మీ ఉద్యోగాలకు ఎంపిక ఏర్పాట్లు – కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 47

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఆర్మీలో ఉద్యోగ నియామకాల ఎంపిక కార్యక్రమ ఏర్పాట్లు చురుగ్గా చేపడుతున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. శుక్రవారం స్థానిక ఎన్‌ఎస్‌.పేట మైదానంలో ఏర్పాట్లను చేపట్టారు. చెత్తను తొలగించి, షామియానాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈనెల 19న జరగనున్న ఎంపిక కార్యక్రమానికి మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన నిరుద్యోగులు సుమారు 2500 మంది హజరౌతారని వారికి భోజనము, వసతి, వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆర్మీ ఉద్యోగాలకు అవసరమైన వారిని ఎంపిక చేసి, వారికి తిరుపతిలో ఎస్వీ డిఫెన్స్ అకాడమిలో రెండు నెలల శిక్షణ ఇప్పించేలా మంత్రి పెద్దిరెడ్డి ఏర్పాట్లు చేశారని తెలిపారు.ఈ ఎంపికకు నియోజకవర్గంలోని నిరుద్యోగులు హాజరై, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags: Selection arrangements for Army jobs to be held on 19th at Punganur – Commissioner KL Verma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page