పుష్పపల్లకీపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారి ద‌ర్శ‌నం

0 8

తిరుమ‌లముచ్చట్లు:

 

 

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఆణివార ఆస్థానం సందర్భంగా శుక్ర‌వారం సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు. చిరుజల్లుల నడుమ పుష్పపల్లకీ సేవ సాగింది.ఆరు ర‌కాల సంప్ర‌దాయ పుష్పాలు, ఆరు ర‌కాల క‌ట్ ఫ్ల‌వ‌ర్లు క‌లిపి దాదాపు ఒక ట‌న్ను పుష్పాల‌తో హంస ఆకారంలో ప‌ల్ల‌కీని అలంక‌రించారు. ప‌ల్ల‌కీ ముందు వైపు శ్రీ‌రాముడు, శ్రీకృష్ణుడు, మ‌ధ్య భాగంలో చిన్నికృష్ణుడు, వెనుక‌వైపు బాల ఆంజ‌నేయ‌స్వామివారి ఆకృతుల‌ను రూపొందించారు. 15 మంది అలంకార నిపుణులు 3 రోజుల పాటు శ్ర‌మించి ఈ పుష్ప‌ప‌ల్ల‌కీని త‌యారుచేశారు.ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో    ఎ.వి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో   ర‌మేష్‌బాబు, ఉద్యానవ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్   శ్రీ‌నివాసులు, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్, పేష్కార్   శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags: Sridevi, Bhudevi Sameta Srimalayappa Swami’s view on Pushpapallaki

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page