ప్రశ్నించే గొంతుకలను పోలీసులు నిర్బంధించలేరు

0 6

టీపీసీసీ కార్యనిర్వాహక రాష్ట్ర కార్యదర్శి బండ శంకర్

జగిత్యాల ముచ్చట్లు:

 

 

- Advertisement -

ప్రజల పక్షాన ప్రభుత్వాలను ప్రశ్నించే గొంతుకలను అక్రమ అరెస్టులతో పోలీసులు నిర్బంధించలేరని,తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక రాష్ట్ర కార్యదర్శి బండ శంకర్ అన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ,వంట గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ  శుక్రవారం ఇచ్చిన పిలుపుమేరకు చలో రాజ్ భవన్ కార్యక్రమానికి తరలి వెళుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అక్రమ అరెస్టులు చేయడం శోచనీయమని ఈ అక్రమ అరెస్టులను ప్రజా సౌమ్యవాదులు ఖండించాలని బండ శంకర్ కోరారు. ప్రతి రోజు డీజిల్ ,పెట్రోల్ ధరలను పెంచుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజల నడ్డివిరుస్తున్నాయన్నారు. నిజానికి పెట్రోల్ మరియు డీజిల్ రూపాయలు 11.40 పైసలకే ప్రజలకు అందించవచ్చునని కేంద్ర పన్ను  రూపాయలు 33శాతం రాష్ట్ర పన్ను రూపాయలు 11.32 శాతం వేయడం వల్లనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని బండ శంకర్ అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ ధరలను తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉదృతం చేస్తుందని బండ శంకర్ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు
హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, జగిత్యాల కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాపురెడ్డి, కౌన్సిలర్ జీవన్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి రాము, కచ్చు హరీష్,నేహాల్, రియాజ్, కిరణ్, కట్ట శివ ,రాజ్ కుమార్, చాంద్ పాషా ,ప్రదీప్, కిషోర్, మధు, షకీల్ పాషా తో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:Police could not restrain the questioning voices

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page