బోయకొండను పర్యాటక భక్తి క్షేత్రంగా తీర్చిదిద్దడమే మంత్రి పెద్దిరెడ్డి లక్ష్యం

0 40

–ఎమ్మెల్యేలు ద్వారకనాథరెడ్డి, శ్రీనివాసులు
— అభివృద్ది పనులు భేష్‌గా జరుగుతున్నాయి
— ఆకర్షణీయంగా పుష్కరిణి, పార్క్ ఏర్పాటు పనులు

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

బోయకొండ ను అత్యంత సుంధరంగా, ఆహ్లాదకరమైన వాతావరణం, పర్యాటక భక్తి క్షేత్రంగా బోయకొండ గంగమ్మ ఆలయంను తీర్చిదిద్దడమే మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లక్ష్యమని మంత్రి సోదరుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అన్నారు. శుక్రవారం చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులతో కలిసి బోయకొండ అమ్మవారిని దర్శించుకొన్నారు. అనంతరం చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణతో కలిసి బోయకొండ ఆలయం వద్ద జరుగుతున్న వివిధ అభివృద్దిపనులను పరిశీలించారు. ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన ప్పటినుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో కోట్లాది రూపాయల పనులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సహకారంతో మంజూరు చేయడం, ఆ పనులు నేడు పూర్తిదశలోకి చేరుతుండడంతో ఆలయం వద్ద కొత్తదనం రూపుదిద్దకొందన్నారు.భక్తులకు మౌళిక వసతులతోపాటు, రవాణా సదుపాయం, రోడ్లుతోపాటు కొండపై ఆహ్లాదరకమైన వాతావరణంను తలపించేలా పార్క్, పుష్కరిణి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మంత్రి చొవర తో బోయకొండను మరింత అభివద్దిచేసి చరిత్రలో బోయకొండ కు ఒక గుర్తింపు తేవాలనే ధ్యేయంతో ఉన్నామని తెలిపారు.గతంలో బోయకొండలో అవినీతి అక్రమాలకు పుట్టగా మారిందని నేడు పారదర్శకంగా పాలన కొనసాగిస్తూ, కోట్లాది రూపాయాల ఆదాయం వనరులను పెంచడంతో పాటు ఆలయ ఆస్తులను ఆక్రమణ దారుల చెరనుంచి రక్షించినట్లు చెప్పారు. మరోనెల రోజుల్లో పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. అందరం కష్టపడి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ది చేసి రాష్ట్రంలో ఆదర్శంగా నిలవడానికి సిబ్బంది, స్థానికులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రెడ్డిప్రకాష్‌, సర్పంచ్‌ వరుణ్‌భరత్‌, మిద్దింటి కిషోర్‌ తదితరులున్నారు.

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

Tags: Minister Peddireddy’s goal is to make Boyakonda a tourist destination

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page