మళ్లీ 2019 రిపీట్ అవుతుందా

0 26

అనంతపురం  ముచ్చట్లు:

 

 

అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ అంటే ఒక చరిత్ర. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరులు జిల్లా రాజకీయాలను శాసించారు. అయితే, గత ఎన్నికల్లో జేసీ ఫ్యామిలీలో మూడో తరం వారసులు పోటీ చేసి ఓటమి పాలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో ఓటమిపాలైనా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో యువకుల సమస్యలపై శుక్రవారం అన్నదమ్ములు గళం విప్పారు.జేసీ కుటుంబాన్ని జగన్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలకు అండగా ఉంటామని జేసీ పవన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను, తన తమ్ముడు అస్మిత్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయినా.. ప్రజల మధ్యే ఉంటున్నామని చెప్పారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయటకు రావట్లేదని.. అందుకే ఈ నెల 19న సీఎం జగన్ ఇంటి తలుపు కొట్టి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇచ్చినా కేసులు పెడతామంటూ జగన్ సర్కార్ బెదిరిస్తోందన్నారు. ఇక, దేనికి పనికి రాని ఓ వ్యక్తి చేతిలో తన తమ్ముడు ఓటమి చెందాడనే బాధ ఉందని.. కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఉద్దేశించి ప్రవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ పార్టీది ఫ్యాన్ గుర్తు అని.. కానీ, యువతీ యువకులు దానికి ఉరేసుకుని ప్రాణాలు కోల్పోతున్నరని పవన్ రెడ్డి ఆరోపించారు.ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లయినా.. ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా అని తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి జేసీ అస్మిత్ రెడ్డి ప్రశ్నించారు. అగ్గిపెట్టె లాంటి ఇళ్లు ఇచ్చి.. కొత్తగా పెళ్లయిన జంటలను విడదీస్తున్నారని వ్యాఖ్యానించారు. నిత్యవసరాలన్నింటిపైనా ఈ ప్రభుత్వం బాదుడే బాదుడని.. మార్కెటింగ్ జిమ్మిక్కులతో ముందుకెళుతున్నారని విమర్శించారు. ప్రతి ఒక్కరూ అహం విడనాడి కలసి కట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. లేకుంటే 2019 రిపీట్ అవుతుందని అస్మిత్‌రెడ్డి పరోక్షంగా తెలుగు దేశం పార్టీ ఘోర ఓటమిని గుర్తు చేస్తూ హెచ్చరించారు.

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:Will 2019 repeat again

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page